ఇంతే నేమెఱుఁగుదు మిద్దరికి సాకిరి
(॥పల్లవి॥)
ఇంతే నేమెఱుఁగుదు మిద్దరికి సాకిరి
చెంతల మీకే తెలుసు చిత్తములో సుద్దులు
(॥ఇంతే॥)
సింగారపుఁ గొప్పు వంగి చిమ్మిరేఁగెఁ దమకము
సంగతిగా నీవు చేయి చాఁచఁఁగాను
వుంగిటిగొని చెక్కుల నుమ్మగిలె బులకలు
చుంగుల కొనగోళ్లు సోఁకఁగాను
(॥ఇంతే॥)
కప్పురపుమోవి వాడి కసరెత్తెఁ దేనెలు
దప్పిదేర మాటలాడి తగులఁగాను
కుప్పళించఁ జెమరించి గురిగాఁడెఁ జూపులు
వొప్పుగ నొకరొకరు వొకచోనే వుండగా
(॥ఇంతే॥)
జవ్వనపుమే నుబ్బి చలిదీరె సిగ్గులు
రవ్వలుగాఁ గూడఁగాను దతివేళను
యివ్వల శ్రీవేంకటేశ యింతిరో మీ రెనయఁగా
నవ్వులు మామోములను ననిచీ మీయెదుట
(||pallavi||)
iṁte nemĕṟum̐gudu middarigi sāgiri
sĕṁtala mīge tĕlusu sittamulo suddulu
(||iṁte||)
siṁgārabum̐ gŏppu vaṁgi simmirem̐gĕm̐ damagamu
saṁgadigā nīvu seyi sām̐sam̐m̐gānu
vuṁgiḍigŏni sĕkkula nummagilĕ bulagalu
suṁgula kŏnagoḽlu som̐kam̐gānu
(||iṁte||)
kappurabumovi vāḍi kasarĕttĕm̐ denĕlu
dappidera māḍalāḍi tagulam̐gānu
kuppaḽiṁcham̐ jĕmariṁchi gurigām̐ḍĕm̐ jūbulu
vŏppuga nŏgarŏgaru vŏgasone vuṁḍagā
(||iṁte||)
javvanabume nubbi salidīrĕ siggulu
ravvalugām̐ gūḍam̐gānu dadiveḽanu
yivvala śhrīveṁkaḍeśha yiṁtiro mī rĕnayam̐gā
navvulu māmomulanu nanisī mīyĕduḍa