Imte naa talabomta limtigi maremi ledu

ఇంతే నా తలపోఁత లింతికి మరేమి లేదు
Language

(॥పల్లవి॥)
ఇంతే నా తలపోఁత లింతికి మరేమి లేదు
కాంతుఁడ సతి చలము కాంక్ష దీరుదాకనే

(॥ఇంతే॥)
చెలిచెక్కుచేయి నిన్నుఁ జేరినయందాఁక
నిలుచుం డెదురుచూపు నినుఁ గనుధాఁకనే
అలపుటనురుసు లంగము లంటినదాఁకా
మలయుమోనము నీతో మాటలాడుదాఁకనే

(॥ఇంతే॥)
కసరులుఁ, గొసగులు కాఁగిలించునందాఁక
వసివాడు లెల్ల నిన్ను పంపించుదాఁకనే
పసురుఁ బులకలెల్ల పైపడి చెనకుదాఁక
ముసిముసి గుంపెనలు నీమోని యానుదాఁకనే

(॥ఇంతే॥)
మిక్కిలి పై కాఁకలెల్ల మేను చెమనించుదాఁక
సుక్కుల సిగ్గులు కనుచొక్కుదాఁకనే
పక్కన శ్రీవేంకటేశ పడఁతియు నీవు నిట్టె
వొక్కటౌట కలకాల మొద్దికౌదాఁకనే

(||pallavi||)
iṁte nā talabom̐ta liṁtigi maremi ledu
kāṁtum̐ḍa sadi salamu kāṁkṣha dīrudāgane

(||iṁte||)
sĕlisĕkkuseyi ninnum̐ jerinayaṁdām̐ka
nilusuṁ ḍĕdurusūbu ninum̐ ganudhām̐kane
alabuḍanurusu laṁgamu laṁṭinadām̐kā
malayumonamu nīdo māḍalāḍudām̐kane

(||iṁte||)
kasarulum̐, gŏsagulu kām̐giliṁchunaṁdām̐ka
vasivāḍu lĕlla ninnu paṁpiṁchudām̐kane
pasurum̐ bulagalĕlla paibaḍi sĕnagudām̐ka
musimusi guṁpĕnalu nīmoni yānudām̐kane

(||iṁte||)
mikkili pai kām̐kalĕlla menu sĕmaniṁchudām̐ka
sukkula siggulu kanusŏkkudām̐kane
pakkana śhrīveṁkaḍeśha paḍam̐tiyu nīvu niṭṭĕ
vŏkkaḍauḍa kalagāla mŏddigaudām̐kane