Imte maremi ledu yimdumeemdanu

ఇంతే మరేమి లేదు యిందుమీఁదను
Language

(॥పల్లవి॥)
ఇంతే మరేమి లేదు యిందుమీఁదను
దొంతుల కర్మములెల్ల దుమ్ము దూరుపెత్తుటా

(॥ఇంతే॥)
వుల్లములోఁ బాయకయుండి రక్షించే హరి
నొల్లకుండుట తన్నుఁ దా నొల్లకుండుట
బల్లిదుఁ డాతని మాని పరుల వేఁడే దెల్లా
పొల్లకట్టు దంచి దంచి పోగువేసుకొనుట

(॥ఇంతే॥)
యియ్యెడఁ బుణ్యపాపములే మిగిలిన హరి
కియ్యకుండుటది దైవమియ్య కుండుట
చెయ్యార నాతని కొప్పునేయని భోగములెల్ల
చయ్యనఁ జెఱకుపిప్పి చవిగొనుటా

(॥ఇంతే॥)
శ్రీకాంతుఁడై నట్టి శ్రీ వేంకటేశ్వరునిఁ
జేకొంటే సిరులెల్లాఁ జేకొనుట
జేకొని హరినామమే నుడుగుచు భక్తిఁ
గైకొనుట అమృతము గైకొనుటా

(||pallavi||)
iṁte maremi ledu yiṁdumīm̐danu
dŏṁtula karmamulĕlla dummu dūrubĕttuḍā

(||iṁte||)
vullamulom̐ bāyagayuṁḍi rakṣhiṁche hari
nŏllaguṁḍuḍa tannum̐ dā nŏllaguṁḍuḍa
ballidum̐ ḍādani māni parula vem̐ḍe dĕllā
pŏllagaṭṭu daṁchi daṁchi poguvesugŏnuḍa

(||iṁte||)
yiyyĕḍam̐ buṇyabābamule migilina hari
kiyyaguṁḍuḍadi daivamiyya kuṁḍuḍa
sĕyyāra nādani kŏppuneyani bhogamulĕlla
sayyanam̐ jĕṟagubippi savigŏnuḍā

(||iṁte||)
śhrīgāṁtum̐ḍai naṭṭi śhrī veṁkaḍeśhvarunim̐
jegŏṁṭe sirulĕllām̐ jegŏnuḍa
jegŏni harināmame nuḍugusu bhaktim̐
gaigŏnuḍa amṛtamu gaigŏnuḍā