ఇంతే కలితే మీరు మా ఇంటిలోని కేఁగరాదా
(॥పల్లవి॥)
ఇంతే కలితే మీరు మా ఇంటిలోని కేఁగరాదా
చెంత మీరు సన్నలేల సేసుకొనేరు
(॥ఇంతే॥)
మొక్కలాన నాకె నీవూ మోములు చూచుకొంటాను
పక్కననట్టె సిగ్గులుపడుకొంటాను
అక్కరతో నంతలోనె యాసల మాటలాడుకొంటా
ఇక్కడ మీరెందాఁకా నేలాటాలాడేరు
(॥ఇంతే॥)
చెలరేఁగి యిద్దరును సెలవుల నవ్వుకొంటా
చలపట్టి బొమ్మలను జంకించుకొటా
నిలువునఁ గరఁగుతా నివ్వెరగు లందుకొంటా
వలపుల నెందాఁకా వసివాడేరు
(॥ఇంతే॥)
చేవమీరి మీకుమీరే చేఁతలు మెచ్చుకొంటాను
యీవల నన్నేలి విడె మిప్పించుకొంటా
శ్రీవేంకటేశుఁడ కూడి చేరి యలమేల్ మంగాను
వేవేలకు నెందాఁకా వినోదాలాడేరు
(||pallavi||)
iṁte kalide mīru mā iṁṭiloni kem̐garādā
sĕṁta mīru sannalela sesugŏneru
(||iṁte||)
mŏkkalāna nāgĕ nīvū momulu sūsugŏṁṭānu
pakkananaṭṭĕ siggulubaḍugŏṁṭānu
akkarado naṁtalonĕ yāsala māḍalāḍugŏṁṭā
ikkaḍa mīrĕṁdām̐kā nelāḍālāḍeru
(||iṁte||)
sĕlarem̐gi yiddarunu sĕlavula navvugŏṁṭā
salabaṭṭi bŏmmalanu jaṁkiṁchugŏḍā
niluvunam̐ garam̐gudā nivvĕragu laṁdugŏṁṭā
valabula nĕṁdām̐kā vasivāḍeru
(||iṁte||)
sevamīri mīgumīre sem̐talu mĕchchugŏṁṭānu
yīvala nanneli viḍĕ mippiṁchugŏṁṭā
śhrīveṁkaḍeśhum̐ḍa kūḍi seri yalamel maṁgānu
vevelagu nĕṁdām̐kā vinodālāḍeru