ఇంతయును నా మేలే యెందు వీఁచుక వచ్చిన
(॥పల్లవి॥)
ఇంతయును నా మేలే యెందు వీఁచుక వచ్చిన
పంతము నెరపఁబోతే బయలే పందిలిరా
(॥ఇంత॥)
నేనే నీతో నలిగిన నీవు నాతోఁ గోపించిన
నానిన విరహమెల్లా నాదే కాదా
యీనెపాన నే నిట్లే యీకె నెంత గొసరిన
కానీరా అదియును నొక్కటికి రెండవురా
(॥ఇంత॥)
వొట్టు నేనే పెట్టుకొన్న వొల్లక నీవుండినాను
నట్టుకున్న జాగరాలు నాసొమ్మే కాదా
ఱట్టుగ నిందుకు ని న్నాఱడి యెంత సేసినాను
కట్టినముడియ నాకు కలకాల మిదిరా
(॥ఇంత॥)
నిచ్చ నే సిగ్గు వడినా నీవు నన్ను మరచినా
నచ్చుల తమకమెల్లా నాపాలిదే
యిచ్చల శ్రీవేంకటేశ యింతలో నన్నుఁ గూడితి
తచ్చి వేసిదియె నాకు దాచిన ధనమురా
(||pallavi||)
iṁtayunu nā mele yĕṁdu vīm̐suga vachchina
paṁtamu nĕrabam̐bode bayale paṁdilirā
(||iṁta||)
nene nīdo naligina nīvu nādom̐ gobiṁchina
nānina virahamĕllā nāde kādā
yīnĕbāna ne niṭle yīgĕ nĕṁta gŏsarina
kānīrā adiyunu nŏkkaḍigi rĕṁḍavurā
(||iṁta||)
vŏṭṭu nene pĕṭṭugŏnna vŏllaga nīvuṁḍinānu
naṭṭugunna jāgarālu nāsŏmme kādā
ṟaṭṭuga niṁdugu ni nnāṟaḍi yĕṁta sesinānu
kaṭṭinamuḍiya nāgu kalagāla midirā
(||iṁta||)
nichcha ne siggu vaḍinā nīvu nannu marasinā
nachchula tamagamĕllā nābālide
yichchala śhrīveṁkaḍeśha yiṁtalo nannum̐ gūḍidi
tachchi vesidiyĕ nāgu dāsina dhanamurā