Imtavaamdavu nee bali mimdumeemdanaa

ఇంతవాఁడవు నీ బలి మిందుమీఁదనా
Language

(॥పల్లవి॥)
ఇంతవాఁడవు నీ బలి మిందుమీఁదనా
పంతపు నీ మనసెల్లఁ బట్టి తెచ్చీనా

(॥ఇంత॥)
పిక్కటిల్లఁ దమకానఁ బెరిగెనింతె చన్నులు
కిక్కిరియ నీవు పెనఁగేపాటివా
పెక్కుమారు లింతయేల పిసికేవు ఇవి నిన్ను
జక్కవపులుగు లిట్టె సాదించీనా

(॥ఇంత॥)
నిండినకోరికలచే నిక్కెనింతె యీతురుము
బండుబండుగా నీవు పట్టేపాటిదా
చండిసేయక విడువు సమయముసేసీ నీపై
గండుఁదుమ్మిదలు ఇవి ఘాతసేసీనా

(॥ఇంత॥)
అట్టె చూడఁగా వెలసె అడుగులనడవులు
పట్టేవేల కూడుమంటా బలిమా యిది
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
జట్టిగొన్నహంస లివి చండిసేసీనా

(||pallavi||)
iṁtavām̐ḍavu nī bali miṁdumīm̐danā
paṁtabu nī manasĕllam̐ baṭṭi tĕchchīnā

(||iṁta||)
pikkaḍillam̐ damagānam̐ bĕrigĕniṁtĕ sannulu
kikkiriya nīvu pĕnam̐gebāḍivā
pĕkkumāru liṁtayela pisigevu ivi ninnu
jakkavabulugu liṭṭĕ sādiṁchīnā

(||iṁta||)
niṁḍinagorigalase nikkĕniṁtĕ yīdurumu
baṁḍubaṁḍugā nīvu paṭṭebāḍidā
saṁḍiseyaga viḍuvu samayamusesī nībai
gaṁḍum̐dummidalu ivi ghādasesīnā

(||iṁta||)
aṭṭĕ sūḍam̐gā vĕlasĕ aḍugulanaḍavulu
paṭṭevela kūḍumaṁṭā balimā yidi
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
jaṭṭigŏnnahaṁsa livi saṁḍisesīnā