ఇంతవాఁడవు నన్నేలి యీ వెలితి నీకేల
(॥పల్లవి॥)
ఇంతవాఁడవు నన్నేలి యీ వెలితి నీకేల
వింతలు సేయక నావెఱపు దెలుపుమీ
(॥ఇంత॥)
నీవు నన్ను మన్నించఁగా నెలఁతలు గుద్దిరాన
వేవేలు నాడుకొంటే విననోపను
భావించి నిన్నుఁదలఁచి పరిణామించుకొంటాను
చేవలుదేరె మనను చిల్లులు గానీకుమీ
(॥ఇంత॥)
చనవు నీ విచ్చితేను సవతులు వెనఁగేటిఁ
పనిలేనివాదులాటఁ బడనోపను
ననుపుగా నిన్నుఁబొంది నవ్వుచు సంతసమున
ఘనమైన యీమేను కాఁక రేఁగించకుమీ
(॥ఇంత॥)
జిగి నన్నుఁ గూడితివి శ్రీవేంకటేశ్వర అట్టి-
మగువల మాను మలదుట కోపను
అగపడి రతుఆనందమునఁ జెంది
తగువై నదినములు దగ్గరనే వుండమీ
(||pallavi||)
iṁtavām̐ḍavu nanneli yī vĕlidi nīgela
viṁtalu seyaga nāvĕṟabu dĕlubumī
(||iṁta||)
nīvu nannu manniṁcham̐gā nĕlam̐talu guddirāna
vevelu nāḍugŏṁṭe vinanobanu
bhāviṁchi ninnum̐dalam̐si pariṇāmiṁchugŏṁṭānu
sevaluderĕ mananu sillulu gānīgumī
(||iṁta||)
sanavu nī vichchidenu savadulu vĕnam̐geḍim̐
panilenivādulāḍam̐ baḍanobanu
nanubugā ninnum̐bŏṁdi navvusu saṁtasamuna
ghanamaina yīmenu kām̐ka rem̐giṁchagumī
(||iṁta||)
jigi nannum̐ gūḍidivi śhrīveṁkaḍeśhvara aṭṭi-
maguvala mānu maladuḍa kobanu
agabaḍi raduānaṁdamunam̐ jĕṁdi
taguvai nadinamulu daggarane vuṁḍamī