Imtavaamdavu gaagunna yedi dooradanamu

ఇంతవాఁడవు గాకున్న యేది దూరతనము
Language

(॥పల్లవి॥)
ఇంతవాఁడవు గాకున్న యేది దూరతనము
వింతకు తలలూఁచేరు వీదికట్టువారలు

(॥ఇంత॥)
వద్ద నొకతెఁ బెట్టుక వారివీరితో మాటాడే
సుద్దులకే నవ్వేరు సుదతులెల్లా
వుద్దండాలు సేసివచ్చి వొగి సాదువలెనుండే
బుద్దులకే మెచ్చేరు పొరుగులవారలు

(॥ఇంత॥)
వొక్కతెపై నొరగుక వువిదలఁ బిలిచేటి
అక్కరకే వెరగందేరంగడివారు
తక్కరితనాల నుంటే తగ నానలు వెట్టేటి
చిక్కులకే బ్రమసేరు సీమసీమవారలు

(॥ఇంత॥)
మెడ నొకతిఁ గట్టుక మెలఁతలఁ జూచేటి
కడఁకలకే మొక్కేరు కడలవారు
విడువక నన్నేలి శ్రీవేంకటేశ నీవుండేటి
వొడికానకే చెలఁగే రూరూరి వారలు

(||pallavi||)
iṁtavām̐ḍavu gāgunna yedi dūradanamu
viṁtagu talalūm̐seru vīdigaṭṭuvāralu

(||iṁta||)
vadda nŏgadĕm̐ bĕṭṭuga vārivīrido māḍāḍe
suddulage navveru sudadulĕllā
vuddaṁḍālu sesivachchi vŏgi sāduvalĕnuṁḍe
buddulage mĕchcheru pŏrugulavāralu

(||iṁta||)
vŏkkadĕbai nŏraguga vuvidalam̐ biliseḍi
akkarage vĕragaṁderaṁgaḍivāru
takkaridanāla nuṁṭe taga nānalu vĕṭṭeḍi
sikkulage bramaseru sīmasīmavāralu

(||iṁta||)
mĕḍa nŏgadim̐ gaṭṭuga mĕlam̐talam̐ jūseḍi
kaḍam̐kalage mŏkkeru kaḍalavāru
viḍuvaga nanneli śhrīveṁkaḍeśha nīvuṁḍeḍi
vŏḍigānage sĕlam̐ge rūrūri vāralu