ఇంతవాఁడవు గాకుంటే యెనతురా గోపికలు
(॥పల్లవి॥)
ఇంతవాఁడవు గాకుంటే యెనతురా గోపికలు
చెంతకురాక తొలుతే చెలఁగె నామొకము
(॥ఇంత॥)
పిలువకతొలుతే ప్రియముతో వచ్చితివి
తలఁచుకొంటివా నీతప్పనిబాస
నిలిచినంతటిలోనె నిండాఁ జెమరించితివి
కలయకతొలుతనె కరఁగే నామనసు
(॥ఇంత॥)
అడుగకతొలుతే ఆనతిచ్చితి వీపని
పెడరేఁచె నావలపు బెట్టుగా నీకు
తడయకతొలుతే దక్కితివి నీవు నాకు
బడిబడి నీకృప ఫలమందెనా
(॥ఇంత॥)
కానికాయీకతొలుతే కాఁగిటఁ గూడితి నన్ను
తానకపునీయాస దైలువారెనా
ఆనుక శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
నానారతులు తొల్లె నాటివుండెనా
(||pallavi||)
iṁtavām̐ḍavu gāguṁṭe yĕnadurā gobigalu
sĕṁtagurāga tŏlude sĕlam̐gĕ nāmŏgamu
(||iṁta||)
piluvagadŏlude priyamudo vachchidivi
talam̐sugŏṁṭivā nīdappanibāsa
nilisinaṁtaḍilonĕ niṁḍām̐ jĕmariṁchidivi
kalayagadŏludanĕ karam̐ge nāmanasu
(||iṁta||)
aḍugagadŏlude ānadichchidi vībani
pĕḍarem̐sĕ nāvalabu bĕṭṭugā nīgu
taḍayagadŏlude dakkidivi nīvu nāgu
baḍibaḍi nīkṛpa phalamaṁdĕnā
(||iṁta||)
kānigāyīgadŏlude kām̐giḍam̐ gūḍidi nannu
tānagabunīyāsa dailuvārĕnā
ānuga śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
nānāradulu tŏllĕ nāḍivuṁḍĕnā