Imtavaamdavu gaagumdide nidu seduvaa

ఇంతవాఁడవు గాకుండితే నిటు సేతువా
Language

(॥పల్లవి॥)
ఇంతవాఁడవు గాకుండితే నిటు సేతువా
వింతలుగా నిట్టే విఱ్ఱవీఁగేవు గాకా

(॥ఇంత॥)
అట్టే నేఁ జూడఁగా నీ వాపెతో మాటలాడవా
వొట్టు వెట్టుకొనేవు గా కూరకే నీవు
చుట్టిరికపుఁ దనాన సొమ్ములు మెడఁ బెట్టివా
చట్టువలె వెఱఁగంది సాదించేవు గాక

(॥ఇంత॥)
ననుపుతో చెలితోడ నవ్వు లెల్లా నవ్వవా
పెనఁగుచు వట్టి సిగ్గు పెంచేవు గాక
తనివోక అప్పటి నీ తమ్ముల మొసఁగవా
చెనకి దొరతనాలు సేసేవు గాకా

(॥ఇంత॥)
గరిమె నప్పుడే ఆకెఁ గౌఁగిలించుకొనవా
విరసానఁ బందెములు వేసేవు గాక
యిరవై శ్రీవేంకటేశ యిట్టే నన్నుఁ గూడవా
మరిగి న న్నందుకే మన్నించేవు గాకా

(||pallavi||)
iṁtavām̐ḍavu gāguṁḍide niḍu seduvā
viṁtalugā niṭṭe viṭravīm̐gevu gāgā

(||iṁta||)
aṭṭe nem̐ jūḍam̐gā nī vābĕdo māḍalāḍavā
vŏṭṭu vĕṭṭugŏnevu gā kūrage nīvu
suṭṭirigabum̐ danāna sŏmmulu mĕḍam̐ bĕṭṭivā
saṭṭuvalĕ vĕṟam̐gaṁdi sādiṁchevu gāga

(||iṁta||)
nanubudo sĕlidoḍa navvu lĕllā navvavā
pĕnam̐gusu vaṭṭi siggu pĕṁchevu gāga
tanivoga appaḍi nī tammula mŏsam̐gavā
sĕnagi dŏradanālu sesevu gāgā

(||iṁta||)
garimĕ nappuḍe āgĕm̐ gaum̐giliṁchugŏnavā
virasānam̐ baṁdĕmulu vesevu gāga
yiravai śhrīveṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍavā
marigi na nnaṁduge manniṁchevu gāgā