Imtasesinavaamdavu yeederimchugonaraadaa

ఇంతసేసినవాఁడవు యీడేరించుకొనరాదా
Language

(॥పల్లవి॥)
ఇంతసేసినవాఁడవు యీడేరించుకొనరాదా
వింతలాయఁ జేఁతలెల్ల వెరపేల నీకును

(॥॥)
పొందులేనివాఁడవైతే పొంతఁ గూచుండఁగనేల
ఇందుముఖి నీతోడ నేల నవ్వీని
మందలించి నన్నునేల మాటల భ్రమఇంచేవు
సందుకొంటి విఁక వట్టిసటలేల నీకును

(॥॥)
ఆసలేనివాఁడవైతే లాసి ఇట్టె చూడనేల
మోసదీర సతి నీకు మొక్కఁగనేల
బాసలిచ్చి నన్నునేల పై పై నొడఁబరచేవు
రాసికెక్కితివి విచారములేల నీకు

(॥॥)
చుట్టమవు గాకుంటే సుద్దులు చెప్పఁగనేల
ఇట్టె ఆయింతి విడె వియ్యవచ్చునా
నెట్టన శ్రీ వేంకటేశనేఁడు నన్ను నేలితివి
గుట్టెల్లాఁ దెలిసితిమి కొంకనేల నీకు

(||pallavi||)
iṁtasesinavām̐ḍavu yīḍeriṁchugŏnarādā
viṁtalāyam̐ jem̐talĕlla vĕrabela nīgunu

(||||)
pŏṁdulenivām̐ḍavaide pŏṁtam̐ gūsuṁḍam̐ganela
iṁdumukhi nīdoḍa nela navvīni
maṁdaliṁchi nannunela māḍala bhrama̮iṁchevu
saṁdugŏṁṭi vim̐ka vaṭṭisaḍalela nīgunu

(||||)
āsalenivām̐ḍavaide lāsi iṭṭĕ sūḍanela
mosadīra sadi nīgu mŏkkam̐ganela
bāsalichchi nannunela pai pai nŏḍam̐barasevu
rāsigĕkkidivi visāramulela nīgu

(||||)
suṭṭamavu gāguṁṭe suddulu sĕppam̐ganela
iṭṭĕ āyiṁti viḍĕ viyyavachchunā
nĕṭṭana śhrī veṁkaḍeśhanem̐ḍu nannu nelidivi
guṭṭĕllām̐ dĕlisidimi kŏṁkanela nīgu