ఇంతనుండి యీమాఁటే యెదలోఁ బెట్టుకోవయ్య
(॥పల్లవి॥)
ఇంతనుండి యీమాఁటే యెదలోఁ బెట్టుకోవయ్య
చెంతలఁ జేరి నే నీసేవ సేసేదానను
(॥ఇంత॥)
వాసులకు వంతులకు వనితలు వెనఁగఁగ
యీసుతోడ నిన్నుఁదిట్టి నేఁటికి నాకు
వేసరకు నీ వేల వెరచేవు నీకుఁగాను
నీసుద్దు లేమిగల్లా నీలోనిదాననే
(॥ఇంత॥)
అంకెలకు లంకెలకు నందరాను రాఁగాను
మంకుతో నిన్ను సాదించ మరి నాకేల
సంకె మాను నే నీతో జగడముదానఁ గాను
యింకా నీ కందుకెల్లా నిచ్చకురాలనే
(॥ఇంత॥)
చనవులమనవులసతు లెల్లా జూడఁగాను
పనిలేనిపాట నాకుఁ బగలేల
యెనసితి శ్రీవేంకటేశ యిదివో నిన్ను
వెనక ముందర నీకు వీడుజోడుదాననే
(||pallavi||)
iṁtanuṁḍi yīmām̐ṭe yĕdalom̐ bĕṭṭugovayya
sĕṁtalam̐ jeri ne nīseva sesedānanu
(||iṁta||)
vāsulagu vaṁtulagu vanidalu vĕnam̐gam̐ga
yīsudoḍa ninnum̐diṭṭi nem̐ṭigi nāgu
vesaragu nī vela vĕrasevu nīgum̐gānu
nīsuddu lemigallā nīlonidānane
(||iṁta||)
aṁkĕlagu laṁkĕlagu naṁdarānu rām̐gānu
maṁkudo ninnu sādiṁcha mari nāgela
saṁkĕ mānu ne nīdo jagaḍamudānam̐ gānu
yiṁkā nī kaṁdugĕllā nichchagurālane
(||iṁta||)
sanavulamanavulasadu lĕllā jūḍam̐gānu
panilenibāḍa nāgum̐ bagalela
yĕnasidi śhrīveṁkaḍeśha yidivo ninnu
vĕnaga muṁdara nīgu vīḍujoḍudānane