Imtalonivaamdavaa yeraa neevu

ఇంతలోనివాఁడవా యేరా నీవు
Language

(॥పల్లవి॥)
ఇంతలోనివాఁడవా యేరా నీవు
చెంతల నీకే యివి చెల్లురా నేఁడు

(॥ఇంతలోని॥)
దగ్గరి రా వని నిన్నుఁ దమకానఁ దిట్టితేను
యెగ్గులు సిగ్గులు నెంచే వేరా నీవు
అగ్గల మై నీతోడి అంకెకత్తెనా నేను
దగ్గరినంతాఁ గలిగె తగురా నాకు

(॥ఇంతలోని॥)
తప్పక చూడ వనుచు తామరఁ గొని వేసితే
యిప్పు డింతలో నలిగే వేరా నీవు
కప్పి నీకు నే నింత కంటకపుదాననా
చెప్పినంతాఁ గలిగెను చెలు లెల్ల నాకు

(॥ఇంతలోని॥)
పరవశ మైతి వని పక్కన గోర నూఁదితే
యెరవుగాఁ జూచేవు యేరా నీవు
సరవి శ్రీవెంకటేశ చన విచ్చి కూడితివి
సరవు లన్నియు గలిగె చాలురా చలము

(||pallavi||)
iṁtalonivām̐ḍavā yerā nīvu
sĕṁtala nīge yivi sĕllurā nem̐ḍu

(||iṁtaloni||)
daggari rā vani ninnum̐ damagānam̐ diṭṭidenu
yĕggulu siggulu nĕṁche verā nīvu
aggala mai nīdoḍi aṁkĕgattĕnā nenu
daggarinaṁtām̐ galigĕ tagurā nāgu

(||iṁtaloni||)
tappaga sūḍa vanusu tāmaram̐ gŏni veside
yippu ḍiṁtalo nalige verā nīvu
kappi nīgu ne niṁta kaṁṭagabudānanā
sĕppinaṁtām̐ galigĕnu sĕlu lĕlla nāgu

(||iṁtaloni||)
paravaśha maidi vani pakkana gora nūm̐dide
yĕravugām̐ jūsevu yerā nīvu
saravi śhrīvĕṁkaḍeśha sana vichchi kūḍidivi
saravu lanniyu galigĕ sālurā salamu