Imtalonivaamdaa taanissee veemdu

ఇంతలోనివాఁడా తానిస్సీ వీఁడు
Language

(॥పల్లవి॥)
ఇంతలోనివాఁడా తానిస్సీ వీఁడు
పంతమెల్లఁ గంటిఁ జాలు పదవే వీఁడు

(॥ఇంత॥)
అలిగి నాతో మాటలాడనివాఁడు నా
చిలుకతో మాటలాడీ చీచీ వీఁడు
నలువంక నాతో నవ్వనివాఁడు నా
చెలితో నవ్వఁగనేలే చెల్లఁబో వీఁడు

(॥ఇంత॥)
వొద్దనె నామోముచూడకుండినవాఁడు నా
అద్దమేల చూచీనే అయ్యో వీఁడు
అద్దో నాకుచములు అంటనివాఁడు నా
ముద్దుఁ గిన్నెరకాయలు ముట్టెనే వీఁడు

(॥ఇంత॥)
పొత్తుమాని వున్నవాఁడు పొదిగి నాయడపము
పొత్తుయేల కలసీనే పోపో వీఁడు
యిత్తల శ్రీవేంకటేశుఁడింత సేసి నన్నుఁగూడె
తత్తరపువాఁడు గదే తగునే వీఁడు

(||pallavi||)
iṁtalonivām̐ḍā tānissī vīm̐ḍu
paṁtamĕllam̐ gaṁṭim̐ jālu padave vīm̐ḍu

(||iṁta||)
aligi nādo māḍalāḍanivām̐ḍu nā
silugado māḍalāḍī sīsī vīm̐ḍu
naluvaṁka nādo navvanivām̐ḍu nā
sĕlido navvam̐ganele sĕllam̐bo vīm̐ḍu

(||iṁta||)
vŏddanĕ nāmomusūḍaguṁḍinavām̐ḍu nā
addamela sūsīne ayyo vīm̐ḍu
addo nāgusamulu aṁṭanivām̐ḍu nā
muddum̐ ginnĕragāyalu muṭṭĕne vīm̐ḍu

(||iṁta||)
pŏttumāni vunnavām̐ḍu pŏdigi nāyaḍabamu
pŏttuyela kalasīne pobo vīm̐ḍu
yittala śhrīveṁkaḍeśhum̐ḍiṁta sesi nannum̐gūḍĕ
tattarabuvām̐ḍu gade tagune vīm̐ḍu