ఇంతలోనిదాననా యేల నీవు లోఁగేవు
(॥పల్లవి॥)
ఇంతలోనిదాననా యేల నీవు లోఁగేవు
చెంతల నీ చెప్పినట్లు సేతు నింతె కాక
(॥ఇంత॥)
నిన్ను నేల దూరేను నీ వేమి సేసినాను
నన్నుఁ జూచుకొని నేనే నవ్వుదుఁగాక
కన్నుల నేల తిట్టేను కాఁకలు సేసినందుకు
మిన్నక చూచినవారి మెప్పింతుఁగాక
(॥ఇంత॥)
ఆసల నేల పట్టేను అప్పటి నీరాకలకు
వాసిఁ దలఁచుక నేనే వత్తుఁగాక
దోస మేల నీకుఁ గట్టె దొమ్మి నీ వెంత సేసినా
బాసలు నీ కొప్పగించి పంత మిత్తుఁగాక
(॥ఇంత॥)
బెట్టిమాట లాడేను నీపెలుచఁదనమునకు
ముట్టి వచ్చితే నీకే మొక్కుదుఁగాక
గట్టిగా శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
యెట్టైనా నీ తగవే యెక్కు డందుఁ గాక
(||pallavi||)
iṁtalonidānanā yela nīvu lom̐gevu
sĕṁtala nī sĕppinaṭlu sedu niṁtĕ kāga
(||iṁta||)
ninnu nela dūrenu nī vemi sesinānu
nannum̐ jūsugŏni nene navvudum̐gāga
kannula nela tiṭṭenu kām̐kalu sesinaṁdugu
minnaga sūsinavāri mĕppiṁtum̐gāga
(||iṁta||)
āsala nela paṭṭenu appaḍi nīrāgalagu
vāsim̐ dalam̐suga nene vattum̐gāga
dosa mela nīgum̐ gaṭṭĕ dŏmmi nī vĕṁta sesinā
bāsalu nī kŏppagiṁchi paṁta mittum̐gāga
(||iṁta||)
bĕṭṭimāḍa lāḍenu nībĕlusam̐danamunagu
muṭṭi vachchide nīge mŏkkudum̐gāga
gaṭṭigā śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
yĕṭṭainā nī tagave yĕkku ḍaṁdum̐ gāga