ఇంతలోనే విభుఁడ మాకేమి దప్పెను । నేడు
(॥పల్లవి॥)
ఇంతలోనే విభుఁడ మాకేమి దప్పెను । నేడు
వింతలుగాఁ దినదిన వేము దీపువో
(॥ఇంత॥)
నీవు మమ్ముఁ జెనకక నిలిచితేఁ జాలుఁగాక
భావజు చెఱకువింటఁ బండు వండెఁబో
తావుల నీబాస నీవే తప్పితేనే చాలుఁగాక
పూవుబాణములపంట పొల్లువోదు వో
(॥ఇంత॥)
కడునింతదీమసము గలిగితేఁ జాలుగాక
చిడుముడి చిగురుల చేగలెక్కెఁబో
వడి నీమాటలు మఱవకవుంటేఁజాలుగాక
గుడిగొన్నవెన్నెలలే కొంగుముడి వో
(॥ఇంత॥)
శ్రీవేంకటేశ నన్నుఁ జేరితేనే చాలుఁగాక
సోవల మోవుల నిట్టే జున్ను వెట్టేఁబో
తావి నాఁకాగిట నిట్టె దక్కితేనే చాలుఁగాక
యేవేళఁ బులకలే ఇరవైనసేసవో
(||pallavi||)
iṁtalone vibhum̐ḍa māgemi dappĕnu | neḍu
viṁtalugām̐ dinadina vemu dībuvo
(||iṁta||)
nīvu mammum̐ jĕnagaka nilisidem̐ jālum̐gāga
bhāvaju sĕṟaguviṁṭam̐ baṁḍu vaṁḍĕm̐bo
tāvula nībāsa nīve tappidene sālum̐gāga
pūvubāṇamulabaṁṭa pŏlluvodu vo
(||iṁta||)
kaḍuniṁtadīmasamu galigidem̐ jālugāga
siḍumuḍi sigurula segalĕkkĕm̐bo
vaḍi nīmāḍalu maṟavagavuṁṭem̐jālugāga
guḍigŏnnavĕnnĕlale kŏṁgumuḍi vo
(||iṁta||)
śhrīveṁkaḍeśha nannum̐ jeridene sālum̐gāga
sovala movula niṭṭe junnu vĕṭṭem̐bo
tāvi nām̐kāgiḍa niṭṭĕ dakkidene sālum̐gāga
yeveḽam̐ bulagale iravainasesavo