Imtalone vegiramaa yidivo neevu

ఇంతలోనే వేగిరమా యిదివో నీవు
Language

(॥పల్లవి॥)
ఇంతలోనే వేగిరమా యిదివో నీవు
పంత మిచ్చి యిప్పుడే పదరితి వయ్యా

(॥ఇంత॥)
సిగ్గువడ్డ దానికే చెలరేఁగుఁ బ్రియములు
వెగ్గళించినది యే వేళమే కిందు పడును
యెగ్గులు వట్టిన దిది యియ్యకోలుకువచ్చు
తగ్గి యాపె కేల లోఁగి తమకించేవయ్యా

(॥ఇంత॥)
కోపగించుకొన్నదే కోరి శాంతానకు వచ్చు
చేపట్లకు వచ్చినదే సేవ లన్నియుఁజేసును
పైపై కొట్లాడినదే పలుకుఁ దేనెలు చిందు
యీపాటికి నిట్టే యీపె కేల లోఁగేవయ్యా

(॥ఇంత॥)
బొమ్మల జంకించినదే పూచిఁ చిఱునవ్వు నవ్వు
నమ్మిక బాస గొన్నదే నంటున నుండు
యెమ్మెల శ్రీవేంకటేశ యీపె యలమేలుమంగ
కమ్మి కూడే వింక నేకడ లోఁగేవయ్యా

(||pallavi||)
iṁtalone vegiramā yidivo nīvu
paṁta michchi yippuḍe padaridi vayyā

(||iṁta||)
sigguvaḍḍa dānige sĕlarem̐gum̐ briyamulu
vĕggaḽiṁchinadi ye veḽame kiṁdu paḍunu
yĕggulu vaṭṭina didi yiyyagoluguvachchu
taggi yābĕ kela lom̐gi tamagiṁchevayyā

(||iṁta||)
kobagiṁchugŏnnade kori śhāṁtānagu vachchu
sebaṭlagu vachchinade seva lanniyum̐jesunu
paibai kŏṭlāḍinade palugum̐ denĕlu siṁdu
yībāḍigi niṭṭe yībĕ kela lom̐gevayyā

(||iṁta||)
bŏmmala jaṁkiṁchinade pūsim̐ siṟunavvu navvu
nammiga bāsa gŏnnade naṁṭuna nuṁḍu
yĕmmĕla śhrīveṁkaḍeśha yībĕ yalamelumaṁga
kammi kūḍe viṁka negaḍa lom̐gevayyā