Imtalone vegiramaa yemdu voyemu

ఇంతలోనె వేగిరమా యెందు వోయేము
Language

(॥పల్లవి॥)
ఇంతలోనె వేగిరమా యెందు వోయేము
వంతులు వెట్టాడకురా వచ్చేఁగాని నేను

(॥ఇంత॥)
నాలితనాననే నీవు నాతులను వలపించి
వేలసంఖ్యలను లోన వేసుకొంటివి
పాలించి యింకా నెందరి భ్రమయించనున్నాఁడవో
చేలకొంగు విడువరా చెప్పేఁగాని నీకు

(॥ఇంత॥)
సాదుఁదనాన నప్పటి సతులఁ దక్కులఁబెట్టి
ఆదిగొ నిందరిమానా లంటుకొంటివి
యీదెస నెవ్వరెవ్వరి నెంతసేయ నున్నాఁడవో
సోదించకురా నావొడి చూపేఁగాని మేలు

(॥ఇంత॥)
మంచితనాననే నీవు మానినులమోవు లాని
చంచుల నెంగిలిసేసి చవిగొంటివి
యెంచఁగ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
దించకురా నీవురము తిరమైతి నిపుడు

(||pallavi||)
iṁtalonĕ vegiramā yĕṁdu voyemu
vaṁtulu vĕṭṭāḍagurā vachchem̐gāni nenu

(||iṁta||)
nālidanānane nīvu nādulanu valabiṁchi
velasaṁkhyalanu lona vesugŏṁṭivi
pāliṁchi yiṁkā nĕṁdari bhramayiṁchanunnām̐ḍavo
selagŏṁgu viḍuvarā sĕppem̐gāni nīgu

(||iṁta||)
sādum̐danāna nappaḍi sadulam̐ dakkulam̐bĕṭṭi
ādigŏ niṁdarimānā laṁṭugŏṁṭivi
yīdĕsa nĕvvarĕvvari nĕṁtaseya nunnām̐ḍavo
sodiṁchagurā nāvŏḍi sūbem̐gāni melu

(||iṁta||)
maṁchidanānane nīvu māninulamovu lāni
saṁchula nĕṁgilisesi savigŏṁṭivi
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
diṁchagurā nīvuramu tiramaidi nibuḍu