Imtalone needo ne nemamduraa

ఇంతలోనె నీతో నే నేమందురా
Language

(॥పల్లవి॥)
ఇంతలోనె నీతో నే నేమందురా
పొంతనుండి నీవే నాకు బుద్దిచెప్పఁ గదరా

(॥॥)
చెక్కుమీఁదటఁ జేయి చిత్తములోపల నూయి
ఇక్కువమాటలు నీతో నే మందురా
చక్కనే నీ నేరువులు చల్లీ నావూరువులు
అక్కడిసుద్దు లేమైనా నానతియ్యరా

(॥॥)
వంచినది నాశిరసు వలపూఁ గడుబిరుసు
ఇంచుకా మొగమోడక యేమందురా
మంచిదే నీలోనిగుట్టు మాకే ఇన్నిటా ఱట్టు
కంచపుఁబొత్తుకు నీవే కై కొలుపఁగదరా

(॥॥)
ముందుఁ దొక్కితి ముంగిలి మోవిమీఁదనె యెంగిలి
యిందరిలోపల నిన్ను నేమందురా
అంది శ్రీవేంకటపతి వలమేలుమంగ నేను
యిందె కూడితివి నన్ను నిఁక నానతియ్యరా

(||pallavi||)
iṁtalonĕ nīdo ne nemaṁdurā
pŏṁtanuṁḍi nīve nāgu buddisĕppam̐ gadarā

(||||)
sĕkkumīm̐daḍam̐ jeyi sittamulobala nūyi
ikkuvamāḍalu nīdo ne maṁdurā
sakkane nī neruvulu sallī nāvūruvulu
akkaḍisuddu lemainā nānadiyyarā

(||||)
vaṁchinadi nāśhirasu valabūm̐ gaḍubirusu
iṁchugā mŏgamoḍaga yemaṁdurā
maṁchide nīloniguṭṭu māge inniḍā ṟaṭṭu
kaṁchabum̐bŏttugu nīve kai kŏlubam̐gadarā

(||||)
muṁdum̐ dŏkkidi muṁgili movimīm̐danĕ yĕṁgili
yiṁdarilobala ninnu nemaṁdurā
aṁdi śhrīveṁkaḍabadi valamelumaṁga nenu
yiṁdĕ kūḍidivi nannu nim̐ka nānadiyyarā