Imtalom gobamu gaddaa iyyagoni vumdavaddaa

ఇంతలోఁ గోపము గద్దా ఇయ్యకొని వుండవద్దా
Language

(॥పల్లవి॥)
ఇంతలోఁ గోపము గద్దా ఇయ్యకొని వుండవద్దా
వింతగాదు నీకు నాకు వెరగైతి నింతే

(॥ఇంత॥)
సతి యేలే గొణఁగూ చల్లకువే సణఁగూ
మతి నీ మొగమై వుండి మళ్లితి నింతే
కతగాఁ దిట్టికువే కానినింద గట్టికువే
పతినై వున్నాఁడఁ గోక పైఁ గప్పుకొంటి నింతే

(॥ఇంత॥)
వద్దువద్దే కసరూ వంచకువే వుసురూ
వద్దఁ బాయ నాలోఁ దలవంచితి నింతే
గద్దించి చూడకువే కల్లలింతాడకువే
పొద్దువోగా నీయింటిలో విద్దిరించే నింతే

(॥ఇంత॥)
వేగిరించి తియ్యకువే వేసాలు సెయ్యకువే
నాగుట్టు నీకుఁ దెలుసు నవ్వితి నింతే
భోగించితిఁగదవే పొంచి ఇంకాఁ బదవే
యీగతి నే శ్రీవేంకటేశుఁడ నింతే

(||pallavi||)
iṁtalom̐ gobamu gaddā iyyagŏni vuṁḍavaddā
viṁtagādu nīgu nāgu vĕragaidi niṁte

(||iṁta||)
sadi yele gŏṇam̐gū sallaguve saṇam̐gū
madi nī mŏgamai vuṁḍi maḽlidi niṁte
kadagām̐ diṭṭiguve kāniniṁda gaṭṭiguve
padinai vunnām̐ḍam̐ goga paim̐ gappugŏṁṭi niṁte

(||iṁta||)
vadduvadde kasarū vaṁchaguve vusurū
vaddam̐ bāya nālom̐ dalavaṁchidi niṁte
gaddiṁchi sūḍaguve kallaliṁtāḍaguve
pŏdduvogā nīyiṁṭilo viddiriṁche niṁte

(||iṁta||)
vegiriṁchi tiyyaguve vesālu sĕyyaguve
nāguṭṭu nīgum̐ dĕlusu navvidi niṁte
bhogiṁchidim̐gadave pŏṁchi iṁkām̐ badave
yīgadi ne śhrīveṁkaḍeśhum̐ḍa niṁte