ఇంతలో విచారము లిట్టుండెను
(॥పల్లవి॥)
ఇంతలో విచారము లిట్టుండెను
పంతాలు దున్నకముందే పంట పండెను
(॥ఇంత॥)
చండి హిరణ్యాక్షనితోడ సరసములాడఁగా
అందనుండే చెలి మారుగొండ లెక్కెను
కొండుకపాయాన నొంటి గుహలో? గూచుండఁగాను
దుండగము సేసేవంటా తొడ యెక్కెను
(॥ఇంత॥)
పాడితోఁ బగర గెల్చి పారుపత్యాలు సేయఁగా
యీడనేసరిగద్దె నెదురెక్కెను
యీడులేనిదొరవైయెడ మిచ్చుకుండఁగాను
తోడివారికంటే ముందు తొడ యెక్కెను
(॥ఇంత॥)
వెల్లవిరిఁ బ్రహ్లాదునివినుతులు వినఁగాను
వొల్లనే సంతతము నీవుర మెక్కెను
అల్లదె శ్రీవేంకటేశ అహోబలాననుండఁగా
తొల్లిటినీలకిమమ్మ తొడయెక్కెను
(||pallavi||)
iṁtalo visāramu liṭṭuṁḍĕnu
paṁtālu dunnagamuṁde paṁṭa paṁḍĕnu
(||iṁta||)
saṁḍi hiraṇyākṣhanidoḍa sarasamulāḍam̐gā
aṁdanuṁḍe sĕli mārugŏṁḍa lĕkkĕnu
kŏṁḍugabāyāna nŏṁṭi guhalo? gūsuṁḍam̐gānu
duṁḍagamu sesevaṁṭā tŏḍa yĕkkĕnu
(||iṁta||)
pāḍidom̐ bagara gĕlsi pārubatyālu seyam̐gā
yīḍanesarigaddĕ nĕdurĕkkĕnu
yīḍulenidŏravaiyĕḍa michchuguṁḍam̐gānu
toḍivārigaṁṭe muṁdu tŏḍa yĕkkĕnu
(||iṁta||)
vĕllavirim̐ brahlādunivinudulu vinam̐gānu
vŏllane saṁtadamu nīvura mĕkkĕnu
alladĕ śhrīveṁkaḍeśha ahobalānanuṁḍam̐gā
tŏlliḍinīlagimamma tŏḍayĕkkĕnu