Imtalo vichchesidivi yeedage maguvam joodu

ఇంతలో విచ్చేసితివి యీడకే మగువఁ జూడు
Language

(॥పల్లవి॥)
ఇంతలో విచ్చేసితివి యీడకే మగువఁ జూడు
కాంత ఇదె నీరాక గాచుకొని వున్నది

(॥ఇంత॥)
వుమ్మగిలు జెమటలు వూరిచి కొనగోరను
చిమ్ముచు నీ సుద్దలే చెలితోఁ జెప్పె
కమ్మటి సంతోసాన కలికి కన్నుల నవ్వు
కుమ్మరించుకొంటా నీగురుతులే చూపె

(॥ఇంత॥)
పొంది పొంది నిట్టూర్పులు పుక్కిళ్ల నాఁచి యాఁచి
నించుకొంటా చెలితోడ నిన్ను సొలసె
వంచిన శిరసుతోడ వలపు పులకలతోఁ
బెంచి పెంచి నిన్నునే పేరుకొని పొగడె

(॥ఇంత॥)
నిలువు నివ్వెరగుతో నీరూపు మదిలోన
తలఁచి నీకు చెలి ముందరనే మొక్కె
వెలఁదిఁ గరుణతో శ్రీవేంకటేశ కూడితివి
నెలకొన్నరతుల నీనేరుపెల్లా మెచ్చెను

(||pallavi||)
iṁtalo vichchesidivi yīḍage maguvam̐ jūḍu
kāṁta idĕ nīrāga gāsugŏni vunnadi

(||iṁta||)
vummagilu jĕmaḍalu vūrisi kŏnagoranu
simmusu nī suddale sĕlidom̐ jĕppĕ
kammaḍi saṁtosāna kaligi kannula navvu
kummariṁchugŏṁṭā nīgurudule sūbĕ

(||iṁta||)
pŏṁdi pŏṁdi niṭṭūrbulu pukkiḽla nām̐si yām̐si
niṁchugŏṁṭā sĕlidoḍa ninnu sŏlasĕ
vaṁchina śhirasudoḍa valabu pulagaladom̐
bĕṁchi pĕṁchi ninnune perugŏni pŏgaḍĕ

(||iṁta||)
niluvu nivvĕragudo nīrūbu madilona
talam̐si nīgu sĕli muṁdarane mŏkkĕ
vĕlam̐dim̐ garuṇado śhrīveṁkaḍeśha kūḍidivi
nĕlagŏnnaradula nīnerubĕllā mĕchchĕnu