Imtalo vichchesidi neege bhaavamide soodu

ఇంతలో విచ్చేసితి నీకె భావమిదె చూడు
Language

(॥పల్లవి॥)
ఇంతలో విచ్చేసితి నీకె భావమిదె చూడు
ఇంతి గోడపై రూపే యీరూపనుచును

(॥॥)
జిగిమించునీరూపు చిత్తరువులోఁ జూచి
నగు నింతి తనతోను నవ్వితివంటా
మొగము చూచేవంటా ముచ్చటతోఁ దలవంచు
చిగురుమోవి చూచి సిగ్గువడును

(॥॥)
చేరి మాటలాడెనంటా జెప్ప నీకుఁ బ్రియములు
కోరికతో దండనుండి కొలువు నేను
సారెకుఁ బానుపుపైకి సన్నలు నేసి పిలుచు
నేరుపుతోఁ దములము నిన్నట్టె యడుగును

(॥॥)
నివ్వెర గైతివంటా నిన్నుఁ గొనగోర నంటు
పవ్వళించుమని చేతఁ బట్టఁబూనును
నివ్వటిల్ల నంతలోనె నీవె వచ్చి కూడితివి
యివ్వల శ్రీవేంకటేశ యిట్టె వోలలాడును

(||pallavi||)
iṁtalo vichchesidi nīgĕ bhāvamidĕ sūḍu
iṁti goḍabai rūbe yīrūbanusunu

(||||)
jigimiṁchunīrūbu sittaruvulom̐ jūsi
nagu niṁti tanadonu navvidivaṁṭā
mŏgamu sūsevaṁṭā muchchaḍadom̐ dalavaṁchu
sigurumovi sūsi sigguvaḍunu

(||||)
seri māḍalāḍĕnaṁṭā jĕppa nīgum̐ briyamulu
korigado daṁḍanuṁḍi kŏluvu nenu
sārĕgum̐ bānububaigi sannalu nesi pilusu
nerubudom̐ damulamu ninnaṭṭĕ yaḍugunu

(||||)
nivvĕra gaidivaṁṭā ninnum̐ gŏnagora naṁṭu
pavvaḽiṁchumani sedam̐ baṭṭam̐būnunu
nivvaḍilla naṁtalonĕ nīvĕ vachchi kūḍidivi
yivvala śhrīveṁkaḍeśha yiṭṭĕ volalāḍunu