ఇంతలో రమణుఁడ నీ వేమి గట్టుకొంటివి
(॥పల్లవి॥)
ఇంతలో రమణుఁడ నీ వేమి గట్టుకొంటివి
కాంతఁ జూచైనాఁ గొంత గరఁగరాదా
(॥ఇంత॥)
సేసకొప్పు వెడజారె చెక్కులఁ జెమటలూరె
పాసియున్న నీయింతితోఁ బలుకరాదా
రాసులుగాఁ బులకించె రామ నిన్నుఁ దిలకించె
బేసబెల్లియెలు గెత్తి పిలువరాదా
(॥ఇంత॥)
చెలిమేను కడుఁగాఁగె చిత్తములు తమిరేఁగె
నలిరేఁగి యాకెతోడ నవ్వరాదా
వలపులు గడుమించె వాడుమో మిప్పుడు వంచె
వెలి నాకెపైఁ జేయి వేయరాదా
(॥ఇంత॥)
కఁదువ నీకాలు దొక్కె కామిని నీపాలఁ జిక్కె
మందలించి యిఁక నీవు మన్నించరాదా
అంది నామాటలు విని యంగనఁ గూడితి విట్టె
ముందె శ్రీవెంకటేశ మోవి ఇయ్యరాదా
(||pallavi||)
iṁtalo ramaṇum̐ḍa nī vemi gaṭṭugŏṁṭivi
kāṁtam̐ jūsainām̐ gŏṁta garam̐garādā
(||iṁta||)
sesagŏppu vĕḍajārĕ sĕkkulam̐ jĕmaḍalūrĕ
pāsiyunna nīyiṁtidom̐ balugarādā
rāsulugām̐ bulagiṁchĕ rāma ninnum̐ dilagiṁchĕ
besabĕlliyĕlu gĕtti piluvarādā
(||iṁta||)
sĕlimenu kaḍum̐gām̐gĕ sittamulu tamirem̐gĕ
nalirem̐gi yāgĕdoḍa navvarādā
valabulu gaḍumiṁchĕ vāḍumo mippuḍu vaṁchĕ
vĕli nāgĕbaim̐ jeyi veyarādā
(||iṁta||)
kam̐duva nīgālu dŏkkĕ kāmini nībālam̐ jikkĕ
maṁdaliṁchi yim̐ka nīvu manniṁcharādā
aṁdi nāmāḍalu vini yaṁganam̐ gūḍidi viṭṭĕ
muṁdĕ śhrīvĕṁkaḍeśha movi iyyarādā