ఇంతలో నిట్లనైతే యింతి గేలిసేయదా
(॥పల్లవి॥)
ఇంతలో నిట్లనైతే యింతి గేలిసేయదా
చింత దీర నాపె కిట్టె చెప్పరాదా ప్రియము
(॥ఇంతలో॥)
తురుము నలఁగను నీతొడ మీఁదఁ బవ్వళించి
తరుణి నీ కెమ్మెవి తప్పక చూచి
సిరిమించ నవ్వితేనే చెక్కులెల్లాఁ జెమరించె
నరగన్ను మోడ్చి చూచే వాడరాదా మాటా
(॥ఇంతలో॥)
గక్కన వాలారుగోళ్ళ గడ్డము వట్టి యూఁచి
మిక్కిలి కామిని నీతో మేలమాడఁగా
నిక్కి నీకడకు వచ్చి నివ్వెఱఁగె కరఁగుచు
యెక్కువ మై పులకించె వియ్యరాదా విడిము
(॥ఇంతలో॥)
వీఁపునఁజన్నులు మోపి వెలఁది కౌఁగిటఁ గూడి
యేపునఁబెక్కు చెఁతల నెలయించఁగా
ఆఁపలేక శ్రీవేంకటాధిప నీవే యాకె
పైపైనే కూడేవు పట్టరాదా మనసు
(||pallavi||)
iṁtalo niṭlanaide yiṁti geliseyadā
siṁta dīra nābĕ kiṭṭĕ sĕpparādā priyamu
(||iṁtalo||)
turumu nalam̐ganu nīdŏḍa mīm̐dam̐ bavvaḽiṁchi
taruṇi nī kĕmmĕvi tappaga sūsi
sirimiṁcha navvidene sĕkkulĕllām̐ jĕmariṁchĕ
naragannu moḍchi sūse vāḍarādā māḍā
(||iṁtalo||)
gakkana vālārugoḽḽa gaḍḍamu vaṭṭi yūm̐si
mikkili kāmini nīdo melamāḍam̐gā
nikki nīgaḍagu vachchi nivvĕṟam̐gĕ karam̐gusu
yĕkkuva mai pulagiṁchĕ viyyarādā viḍimu
(||iṁtalo||)
vīm̐punam̐jannulu mobi vĕlam̐di kaum̐giḍam̐ gūḍi
yebunam̐bĕkku sĕm̐tala nĕlayiṁcham̐gā
ām̐palega śhrīveṁkaḍādhiba nīve yāgĕ
paibaine kūḍevu paṭṭarādā manasu