Imtalo neevela yemmegu navvevu

ఇంతలో నీవేల యెమ్మెకు నవ్వేవు
Language

(॥పల్లవి॥)
ఇంతలో నీవేల యెమ్మెకు నవ్వేవు
చెంతల నూఁకొనఁ జెల్లదా నాకూ

(॥ఇంత॥)
అంగపుఁ గాఁకలు ఆయము సోఁకఁగ
ముంగిట నినుఁ గని ములిగితిని
చెంగటివలపులు చెక్కుల నుండఁగ
పొంగి మూతి గిరుపుట యిది దగదా

(॥ఇంత॥)
మనసునఁ దోఁచినమాఁటలు మెరమఁగ
చొనిపి తప్ప కటు చూచితిని
వెనకటిబాసలు వేగిరపడఁగా
పొనిఁగి కేకరింపులు చూపితిని

(॥ఇంత॥)
గక్కన నాసలు కాఁగిట నుండఁగ
ముక్కున వేలిడి మొరఁగితిని
యిక్కడ శ్రీ వేంకటేశ కూడితివి
మిక్కిలి నిన్నే మెచ్చితిని

(||pallavi||)
iṁtalo nīvela yĕmmĕgu navvevu
sĕṁtala nūm̐kŏnam̐ jĕlladā nāgū

(||iṁta||)
aṁgabum̐ gām̐kalu āyamu som̐kam̐ga
muṁgiḍa ninum̐ gani muligidini
sĕṁgaḍivalabulu sĕkkula nuṁḍam̐ga
pŏṁgi mūdi girubuḍa yidi dagadā

(||iṁta||)
manasunam̐ dom̐sinamām̐ṭalu mĕramam̐ga
sŏnibi tappa kaḍu sūsidini
vĕnagaḍibāsalu vegirabaḍam̐gā
pŏnim̐gi kegariṁpulu sūbidini

(||iṁta||)
gakkana nāsalu kām̐giḍa nuṁḍam̐ga
mukkuna veliḍi mŏram̐gidini
yikkaḍa śhrī veṁkaḍeśha kūḍidivi
mikkili ninne mĕchchidini