Imtalo nee ramanumdu yeedage vichchesenu

ఇంతలో నీ రమణుఁడు యీడకే విచ్చేసెను
Language

(॥పల్లవి॥)
ఇంతలో నీ రమణుఁడు యీడకే విచ్చేసెను
వింతలాయెఁ బనులెల్లా వెఱ పేలే యిఁకను

(॥ఇంతలో॥)
మరుని యమ్ములకును మరుని బలఁగమైన
గరిమలఁ దుమ్మెదమూఁకలేపగ
తరుణిరో యిందులోనే తమలో విఱివోటాయె
విరహిజనులకెల్ల వెఱుపేలే యిఁకను

(॥ఇంతలో॥)
కాముని కైదువలకు కామునిపంపులైన
ఆమని కోమోలలెల్ల నవియేపగ
కామినిరో తమలోనే కలఁక లెప్పుడుఁ బోవు
వేమరు నిందుకుఁగాను వేఱుపేలే యికను

(॥ఇంతలో॥)
మదను జక్కవలకు మదనుని చుట్టమైన
తుదమీరి వున్నమ చందురుఁడే పగ
యెదుట శ్రీవేంకటేశుఁ డిదె నిన్ను నిట్టె కూడె
వెదకి తెలుకొంటె వెఱుపేలే యిఁకను

(||pallavi||)
iṁtalo nī ramaṇum̐ḍu yīḍage vichchesĕnu
viṁtalāyĕm̐ banulĕllā vĕṟa pele yim̐kanu

(||iṁtalo||)
maruni yammulagunu maruni balam̐gamaina
garimalam̐ dummĕdamūm̐kalebaga
taruṇiro yiṁdulone tamalo viṟivoḍāyĕ
virahijanulagĕlla vĕṟubele yim̐kanu

(||iṁtalo||)
kāmuni kaiduvalagu kāmunibaṁpulaina
āmani komolalĕlla naviyebaga
kāminiro tamalone kalam̐ka lĕppuḍum̐ bovu
vemaru niṁdugum̐gānu veṟubele yiganu

(||iṁtalo||)
madanu jakkavalagu madanuni suṭṭamaina
tudamīri vunnama saṁdurum̐ḍe paga
yĕduḍa śhrīveṁkaḍeśhum̐ ḍidĕ ninnu niṭṭĕ kūḍĕ
vĕdagi tĕlugŏṁṭĕ vĕṟubele yim̐kanu