Imtalo nannum joosi yela daamgevu

ఇంతలో నన్నుఁ జూచి యేల దాఁగేవు
Language

(॥పల్లవి॥)
ఇంతలో నన్నుఁ జూచి యేల దాఁగేవు
అంతయు నే నెఱుఁగుదు నీవుఁ గాదనేనా

(॥ఇంతలో॥)
నిక్కముగా రమణుడుఁనెలఁతకుఁ జెప్పేమాట
వక్కణ లడుగవే వ్రాసుకోవే
అక్కడనుండి వచ్చితి నా సుద్దు లెల్లాఁ జెప్పీ
మొక్కవే చెలికత్తెవు ముంచి యాపెమారు

(॥ఇంతలో॥)
కానీవే యాల లోఁగేవు కాంతునిచే వుంగరము
ఆనవాలిప్పించుకోవే ఆకేఁ దేవే
పూనుకొని వున్నదానవు పోరానిచుట్టమవు
కానికెగానీమో టెంకాయ నీ వాపెమారు

(॥ఇంతలో॥)
వేళ యేమి చూచేవే శ్రీవేంకటేశుచెవిలోన
తాలిమితోడుత యాకాంతము లాడవే
యేలినాఁడు నన్నితఁడిట్టే యింతి నీతనికి
ఆలిఁగాఁ జేసితి వీడె మందవే ఆకె మారు

(||pallavi||)
iṁtalo nannum̐ jūsi yela dām̐gevu
aṁtayu ne nĕṟum̐gudu nīvum̐ gādanenā

(||iṁtalo||)
nikkamugā ramaṇuḍum̐nĕlam̐tagum̐ jĕppemāḍa
vakkaṇa laḍugave vrāsugove
akkaḍanuṁḍi vachchidi nā suddu lĕllām̐ jĕppī
mŏkkave sĕligattĕvu muṁchi yābĕmāru

(||iṁtalo||)
kānīve yāla lom̐gevu kāṁtunise vuṁgaramu
ānavālippiṁchugove āgem̐ deve
pūnugŏni vunnadānavu porānisuṭṭamavu
kānigĕgānīmo ṭĕṁkāya nī vābĕmāru

(||iṁtalo||)
veḽa yemi sūseve śhrīveṁkaḍeśhusĕvilona
tālimidoḍuda yāgāṁtamu lāḍave
yelinām̐ḍu nannidam̐ḍiṭṭe yiṁti nīdanigi
ālim̐gām̐ jesidi vīḍĕ maṁdave āgĕ māru