Imtalesi kobunaa yeebe needonu

ఇంతలేసి కోపునా యీపె నీతోను
Language

(॥పల్లవి॥)
ఇంతలేసి కోపునా యీపె నీతోను
మంతనాన గుట్టుతోనే మన్నింతువు గాక

(॥ఇంత॥)
కలువపూవుల వేసి కనుసన్న లటుసేసి
తలకొని జవరాలిఁ దమిరేఁచేవు
మొలకనవ్వులు నవ్వి మోవినే యాసలు చూపి
యెలయించి ఆఁటదాని నెంత సేసేవు

(॥ఇంత॥)
పన్నీరు మీఁదఁ జల్లి పక్కనఁ గందువ చెప్పి
కన్న చోటనే యింతిఁ గరఁ గించేవు
చన్ను లూరకే పొగడి సళుపుఁ జూపులఁ జూచి
అన్నిటాను ముద్దరాలి నలయించ నేఁటికి

(॥ఇంత॥)
కప్పురము నోరనిచ్చి కాఁగిటను బిగియించి
చొప్పులెత్తి పువ్వుఁ బోణిఁ జొక్కించేవు
యిప్పుడే శ్రీ వేంకటేశ యీకె నిట్టె యేలితివి
వొప్పుగ నీ యిల్లాలి వొగి బాయ కిఁకను

(||pallavi||)
iṁtalesi kobunā yībĕ nīdonu
maṁtanāna guṭṭudone manniṁtuvu gāga

(||iṁta||)
kaluvabūvula vesi kanusanna laḍusesi
talagŏni javarālim̐ damirem̐sevu
mŏlaganavvulu navvi movine yāsalu sūbi
yĕlayiṁchi ām̐ṭadāni nĕṁta sesevu

(||iṁta||)
pannīru mīm̐dam̐ jalli pakkanam̐ gaṁduva sĕppi
kanna soḍane yiṁtim̐ garam̐ giṁchevu
sannu lūrage pŏgaḍi saḽubum̐ jūbulam̐ jūsi
anniḍānu muddarāli nalayiṁcha nem̐ṭigi

(||iṁta||)
kappuramu noranichchi kām̐giḍanu bigiyiṁchi
sŏppulĕtti puvvum̐ boṇim̐ jŏkkiṁchevu
yippuḍe śhrī veṁkaḍeśha yīgĕ niṭṭĕ yelidivi
vŏppuga nī yillāli vŏgi bāya kim̐kanu