ఇంతలేసి కావలెనా యింకాను నీ
(॥పల్లవి॥)
ఇంతలేసి కావలెనా యింకాను నీ-
బంతిభోజనాలే చాలుఁ బాలించ మమ్మును
(॥ఇంత॥)
పట్టకుమీ నీవు నన్నుఁ బలుమారును నీ
వెట్టివలపుల చేతవే సరితిమి
గుట్టెఱుఁగుదువు మాతో కొసరు లే నీ
చుట్టరికములె చాలుఁ జొక్కించ మమ్మును
(॥ఇంత॥)
చెప్పకుమీ ప్రియములు చేరి నాకునూ నీ
తప్పనిఆనలచేతఁ దనిసితిమి
యెప్పటివాఁడవే మాఇచ్చకాలేల నీ
కప్నురవిడేలే చాలుఁ గరఁగించ మమ్మును
(॥ఇంత॥)
నవ్వకుమీ నీవునాతో నయములనునీ
పువ్వులవాటులచేతఁబొదలితిమి
రవ్వగా శ్రీవేంకటేశ రతి నన్నుఁ గూడితి నీ
బువ్వపు మోవే చాలు పొసఁగించ మమ్మును
(||pallavi||)
iṁtalesi kāvalĕnā yiṁkānu nī-
baṁtibhojanāle sālum̐ bāliṁcha mammunu
(||iṁta||)
paṭṭagumī nīvu nannum̐ balumārunu nī
vĕṭṭivalabula sedave saridimi
guṭṭĕṟum̐guduvu mādo kŏsaru le nī
suṭṭarigamulĕ sālum̐ jŏkkiṁcha mammunu
(||iṁta||)
sĕppagumī priyamulu seri nāgunū nī
tappaniānalasedam̐ danisidimi
yĕppaḍivām̐ḍave māichchagālela nī
kapnuraviḍele sālum̐ garam̐giṁcha mammunu
(||iṁta||)
navvagumī nīvunādo nayamulanunī
puvvulavāḍulasedam̐bŏdalidimi
ravvagā śhrīveṁkaḍeśha radi nannum̐ gūḍidi nī
buvvabu move sālu pŏsam̐giṁcha mammunu