ఇంతలాయ వింతలాయ నెందాఁక సరసాలు
(॥పల్లవి॥)
ఇంతలాయ వింతలాయ నెందాఁక సరసాలు
చెంతలఁ జేరఁగరాదా చెలి జవ్వనమున
(॥ఇంత॥)
చిత్తరువు వ్రాఁతలాయ చెలినివ్వెరగులు
ముత్తెపుముగ్గులాయను మోహములెల్లా
పొత్తుల తేనియలాయ పొలఁతి పలుకులెల్లా
చిత్తగించి చూడరాదా చెలియభావములు
(॥ఇంత॥)
విడువనిజడులాయ వెలఁదిమొయిచెమటలు
తడఁబడే సంపదాయ తమక మది
కడివోని విరులాయ కందువకోరిక లివి
తొడిఁబడఁజూడరాదా తొయ్యలిచందములు
(॥ఇంత॥)
పూచిన వెన్నెలలాయ పొలఁతి సెలవినవ్వు
చూచినటల్లానాయ సొంపుకళలు
యేచిన శ్రీవేంకటేశ ఇట్టె ఇంతిఁ గూడితివి
రాచిలుకవంటి దాయ రమణి నీరతిని
(||pallavi||)
iṁtalāya viṁtalāya nĕṁdām̐ka sarasālu
sĕṁtalam̐ jeram̐garādā sĕli javvanamuna
(||iṁta||)
sittaruvu vrām̐talāya sĕlinivvĕragulu
muttĕbumuggulāyanu mohamulĕllā
pŏttula teniyalāya pŏlam̐ti palugulĕllā
sittagiṁchi sūḍarādā sĕliyabhāvamulu
(||iṁta||)
viḍuvanijaḍulāya vĕlam̐dimŏyisĕmaḍalu
taḍam̐baḍe saṁpadāya tamaga madi
kaḍivoni virulāya kaṁduvagoriga livi
tŏḍim̐baḍam̐jūḍarādā tŏyyalisaṁdamulu
(||iṁta||)
pūsina vĕnnĕlalāya pŏlam̐ti sĕlavinavvu
sūsinaḍallānāya sŏṁpugaḽalu
yesina śhrīveṁkaḍeśha iṭṭĕ iṁtim̐ gūḍidivi
rāsilugavaṁṭi dāya ramaṇi nīradini