Imtagu vachchinameemda nimkanela mogamoda

ఇంతకు వచ్చినమీఁద నిఁకనేల మొగమోట
Language

(॥పల్లవి॥)
ఇంతకు వచ్చినమీఁద నిఁకనేల మొగమోట
చింతదీర నిన్ను నేమి సేసినానుఁ జెల్లదా

(॥ఇంత॥)
యీగతి నిద్దిరించేవు యిట్టె నావద్దికి వచ్చి
వేగుదాఁకా నీ పొందు వెగటా నీకు
చేగదేరనిని ఆడఁ జేయ మరచి వచ్చితా
ఆగడపునిన్ను దూరనట్టె నాకుఁ ఖల్లదా

(॥ఇంత॥)
పన్ని తల నొచ్చీనంటాఁ బైపైనిట్టె మూలిగేవు
విన్నవించే నామాట వేసటా నీకు
యిన్నేసి మాయలు సేయనీడనే నేరిచితివా
కన్నచోట నీగుణాలు కాకుసేయఁ జెల్లదా

(॥ఇంత॥)
చెల్లినంతాఁ జేసి వచ్చి చేయివట్టి పెనఁగేవు
పల్లదాన నే నేఁడు బాఁతే నీకు
వొల్లనే శ్రీవేంకటేశ వూరడించి కూడితివి
చల్లజంపులను నిన్ను జంకించఁ జెల్లదా

(||pallavi||)
iṁtagu vachchinamīm̐da nim̐kanela mŏgamoḍa
siṁtadīra ninnu nemi sesinānum̐ jĕlladā

(||iṁta||)
yīgadi niddiriṁchevu yiṭṭĕ nāvaddigi vachchi
vegudām̐kā nī pŏṁdu vĕgaḍā nīgu
segaderanini āḍam̐ jeya marasi vachchidā
āgaḍabuninnu dūranaṭṭĕ nāgum̐ khalladā

(||iṁta||)
panni tala nŏchchīnaṁṭām̐ baibainiṭṭĕ mūligevu
vinnaviṁche nāmāḍa vesaḍā nīgu
yinnesi māyalu seyanīḍane nerisidivā
kannasoḍa nīguṇālu kāguseyam̐ jĕlladā

(||iṁta||)
sĕllinaṁtām̐ jesi vachchi seyivaṭṭi pĕnam̐gevu
palladāna ne nem̐ḍu bām̐te nīgu
vŏllane śhrīveṁkaḍeśha vūraḍiṁchi kūḍidivi
sallajaṁpulanu ninnu jaṁkiṁcham̐ jĕlladā