Imtagu vachchenaa nemdu yeebe valabu

ఇంతకు వచ్చెనా నేఁడు యీపె వలపు
Language

(॥పల్లవి॥)
ఇంతకు వచ్చెనా నేఁడు యీపె వలపు
సంత సతులకు నేఁడు సన్నలు చూపేవు

(॥॥)
సేసకొప్పు వంచదా చేరి నీకు మొక్కదా
ఆసతో సేవలు సేయదా యింతి
వాసులెక్కించి యాడోవనితనుఁ బురికొల్పి
మాసటీనివలె నేఁడు మాటలాడించేవు

(॥॥)
పెడరేఁచి వీడెమీదా ప్రియములు చెప్పదా
చిడుముడి చన్నులఁ బూజించదా యింతి
యెడమిచ్చి వేరొక్కతె నెఱఁగనటే తెచ్చి
కడవానివలె నేఁడు కాకుసేయించేవు

(॥॥)
ఇటు నిన్నుఁగూడదా యింపు నీకుఁజేయదా
నటన శ్రీ వేంకటేశ నవ్వదా ఇంతి
ఘటనఁబరకాంతను కన్ను లెదుట నిలిపి
విటునిచందాన నేఁడు విద్యలాడించేవు

(||pallavi||)
iṁtagu vachchĕnā nem̐ḍu yībĕ valabu
saṁta sadulagu nem̐ḍu sannalu sūbevu

(||||)
sesagŏppu vaṁchadā seri nīgu mŏkkadā
āsado sevalu seyadā yiṁti
vāsulĕkkiṁchi yāḍovanidanum̐ burigŏlbi
māsaḍīnivalĕ nem̐ḍu māḍalāḍiṁchevu

(||||)
pĕḍarem̐si vīḍĕmīdā priyamulu sĕppadā
siḍumuḍi sannulam̐ būjiṁchadā yiṁti
yĕḍamichchi verŏkkadĕ nĕṟam̐ganaḍe tĕchchi
kaḍavānivalĕ nem̐ḍu kāguseyiṁchevu

(||||)
iḍu ninnum̐gūḍadā yiṁpu nīgum̐jeyadā
naḍana śhrī veṁkaḍeśha navvadā iṁti
ghaḍanam̐baragāṁtanu kannu lĕduḍa nilibi
viḍunisaṁdāna nem̐ḍu vidyalāḍiṁchevu