ఇంతకు నోపుదుమా ఇయ్యకొనఁగలమా
(॥పల్లవి॥)
ఇంతకు నోపుదుమా ఇయ్యకొనఁగలమా
బంతులను వలపులు పచ్చివెచ్చై వుండును
(॥ఇంత॥)
తెరమఱఁగు మాటలు తీపులు దంపతులకు
గరిసించి యడిగితే గసిగట్టును
దొరవు నీతోడిపొందు తొలుతనే ప్రియములు
గెరసుదాటితేనే గిజిగిజై తోఁచును
(॥ఇంత॥)
మూఁకలోని నగవులు ముంగిటిపైఁడై వుండు
కాఁకలు వుట్టించఁబోతే కసుగందును
ఆఁకల నీఅడియాస అండనుంటే దమిరేఁచు
చీఁకటివడితే నదె చిందువందై జారును
(॥ఇంత॥)
పెండిలిలో పెనఁగులు ప్రియములై కడు మించు
గండి గడిచితే నది కలఇకౌను
కొండలౌ శ్రీ వేంకటేశ కూడిన నీనారతులు
చండియై కొసరఁబోతే సదమదమౌను
(||pallavi||)
iṁtagu nobudumā iyyagŏnam̐galamā
baṁtulanu valabulu pachchivĕchchai vuṁḍunu
(||iṁta||)
tĕramaṟam̐gu māḍalu tībulu daṁpadulagu
garisiṁchi yaḍigide gasigaṭṭunu
dŏravu nīdoḍibŏṁdu tŏludane priyamulu
gĕrasudāḍidene gijigijai tom̐sunu
(||iṁta||)
mūm̐kaloni nagavulu muṁgiḍibaim̐ḍai vuṁḍu
kām̐kalu vuṭṭiṁcham̐bode kasugaṁdunu
ām̐kala nīaḍiyāsa aṁḍanuṁṭe damirem̐su
sīm̐kaḍivaḍide nadĕ siṁduvaṁdai jārunu
(||iṁta||)
pĕṁḍililo pĕnam̐gulu priyamulai kaḍu miṁchu
gaṁḍi gaḍiside nadi kala̮igaunu
kŏṁḍalau śhrī veṁkaḍeśha kūḍina nīnāradulu
saṁḍiyai kŏsaram̐bode sadamadamaunu