ఇంతకు మిక్కిలి మాఁట యేమియు నాడకుమనె
(॥పల్లవి॥)
ఇంతకు మిక్కిలి మాఁట యేమియు నాడకుమనె
అంతయు నీ వెఱుఁగుదు వటమీఁద ననుచు
(॥ఇంత॥)
పడఁతి నీకుఁ గప్పురపలుకు గానుక యంపె
వడి నీ మాఁటలు నీకే వచ్చెనంటాను
తడయక మరి మొల్లదండలు నీవద్ది కం పె
నడుమనే తనపాట నవ్వులారయ ననుచు
(॥ఇంత॥)
పుచ్చిననీలాలదండ గొబ్బున నీకు నంపె
మచ్చిక నీచూపు నీకె మరలెనంటా
అచ్చపుబంగారుబొమ్మ నదియును నీ కంపె
యిచ్చితిఁబో తనదేహ మిదె కొమ్మనుచు
(॥ఇంత॥)
తోడనే చెలియ నీకు దొంతరపువ్వులు నంపె
కూడినకూకటకములకు గురుతంటాను
యీడవె శ్రీ వేంకటేశ యిద్దరుఁ గూడితి రిట్టె
వేడుక తొల్లటివెల్లా వీడుకు వీడనుచు
(||pallavi||)
iṁtagu mikkili mām̐ṭa yemiyu nāḍagumanĕ
aṁtayu nī vĕṟum̐gudu vaḍamīm̐da nanusu
(||iṁta||)
paḍam̐ti nīgum̐ gappurabalugu gānuga yaṁpĕ
vaḍi nī mām̐ṭalu nīge vachchĕnaṁṭānu
taḍayaga mari mŏlladaṁḍalu nīvaddi kaṁ pĕ
naḍumane tanabāḍa navvulāraya nanusu
(||iṁta||)
puchchinanīlāladaṁḍa gŏbbuna nīgu naṁpĕ
machchiga nīsūbu nīgĕ maralĕnaṁṭā
achchabubaṁgārubŏmma nadiyunu nī kaṁpĕ
yichchidim̐bo tanadeha midĕ kŏmmanusu
(||iṁta||)
toḍane sĕliya nīgu dŏṁtarabuvvulu naṁpĕ
kūḍinagūgaḍagamulagu gurudaṁṭānu
yīḍavĕ śhrī veṁkaḍeśha yiddarum̐ gūḍidi riṭṭĕ
veḍuga tŏllaḍivĕllā vīḍugu vīḍanusu