ఇంతకోపితే మా పొందు లిటు నీవు సేయవయ్య
(॥పల్లవి॥)
ఇంతకోపితే మా పొందు లిటు నీవు సేయవయ్య
చెంతనే నోరూరించుఁ జెలుల వలపులు
(॥ఇంత॥)
చెవులొగ్గి వింటేను చిగిరించు మాటలు
తివిరి వూఁకొంటేను తీగెలు సాగు
నవకమై లాలించితే ననలొత్తుఁ గొరికలు
చనవులు పైపైరేఁచు సతులవలపులు
(॥ఇంత॥)
కన్నులఁ జూచితేను కడుఁబొదలు మనసు
సన్నలకు లొనైతే ససు లొత్తును
అన్నిటా సమ్మతించితే ననలుఁగొనలుఁ బారు
యెన్నేని చెప్పఁగవచ్చు నింతులవలపులు
(॥ఇంత॥)
చేరి వద్దగూచుంటేఁ జెలరేఁగు నవ్వులు
సారెఁ జవిగొంటే మోవిచవులు వుట్టు
యీరీతి శ్రీవేంకటే యిటు నన్నుఁ గూడితివి
కారుకమ్మినపంటలు కాంతలవలపులు
(||pallavi||)
iṁtagobide mā pŏṁdu liḍu nīvu seyavayya
sĕṁtane norūriṁchum̐ jĕlula valabulu
(||iṁta||)
sĕvulŏggi viṁṭenu sigiriṁchu māḍalu
tiviri vūm̐kŏṁṭenu tīgĕlu sāgu
navagamai lāliṁchide nanalŏttum̐ gŏrigalu
sanavulu paibairem̐su sadulavalabulu
(||iṁta||)
kannulam̐ jūsidenu kaḍum̐bŏdalu manasu
sannalagu lŏnaide sasu lŏttunu
anniḍā sammadiṁchide nanalum̐gŏnalum̐ bāru
yĕnneni sĕppam̐gavachchu niṁtulavalabulu
(||iṁta||)
seri vaddagūsuṁṭem̐ jĕlarem̐gu navvulu
sārĕm̐ javigŏṁṭe movisavulu vuṭṭu
yīrīdi śhrīveṁkaḍe yiḍu nannum̐ gūḍidivi
kārugamminabaṁṭalu kāṁtalavalabulu