ఇంతకమునుపే నీకు నెదురుగా వచ్చునేమో
(॥పల్లవి॥)
ఇంతకమునుపే నీకు నెదురుగా వచ్చునేమో
నింతలేక నీ విప్పుడే వేగమే రప్పించవే
(॥ఇంత॥)
విన్నపాలెల్లా విన్నాఁడు విడెము నాకిచ్చినాఁడు
చెన్నుమీర నింటికి వచ్చేనన్నాఁడు
మన్నించేననుచు నాకు మాటపట్టూ నిచ్చినాఁడు
అన్నిటా నావిభుని రమ్మని తోడితేఁగదే
(॥ఇంత॥)
కోరి బత్తి చేకొన్నాఁడు కొప్పు నాకు బెట్టినాఁడు
కేరి నవ్వి మావిందారగించేనన్నాఁడు
గారవించి నావెంటనే కప్పురమూ నంపినాఁడు
పేరుకొని మొక్కెతనిఁ బిలుచుకరాఁగదే
(॥ఇంత॥)
కడుఁగడు మెచ్చినాఁడు కాఁగిలించుకొన్నాఁడు
యెడయక నన్ను నిట్టే యేలినాఁడు
అడరి శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగను నేను
బడినేవదెచ్చి యాతనిఁ బాన్పుపై నిలుపరే
(||pallavi||)
iṁtagamunube nīgu nĕdurugā vachchunemo
niṁtalega nī vippuḍe vegame rappiṁchave
(||iṁta||)
vinnabālĕllā vinnām̐ḍu viḍĕmu nāgichchinām̐ḍu
sĕnnumīra niṁṭigi vachchenannām̐ḍu
manniṁchenanusu nāgu māḍabaṭṭū nichchinām̐ḍu
anniḍā nāvibhuni rammani toḍidem̐gade
(||iṁta||)
kori batti segŏnnām̐ḍu kŏppu nāgu bĕṭṭinām̐ḍu
keri navvi māviṁdāragiṁchenannām̐ḍu
gāraviṁchi nāvĕṁṭane kappuramū naṁpinām̐ḍu
perugŏni mŏkkĕdanim̐ bilusugarām̐gade
(||iṁta||)
kaḍum̐gaḍu mĕchchinām̐ḍu kām̐giliṁchugŏnnām̐ḍu
yĕḍayaga nannu niṭṭe yelinām̐ḍu
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
baḍinevadĕchchi yādanim̐ bānpubai nilubare