Imtagamtenemi sedu nimkaa naanadiyyavayya

ఇంతకంటెనేమి సేతు నింకా నానతియ్యవయ్య
Language

(॥పల్లవి॥)
ఇంతకంటెనేమి సేతు నింకా నానతియ్యవయ్య
కాంత లిందరూ మెచ్చఁ గడమా జేసెను

(॥ఇంత॥)
చేకొని నీ వదనము చెంగలించవలె నంటా
నీ కాంతఁ బొగడుదు నీ ముందరనే
ఆక డీకడ నీ మేనుబ్బై యుండవలె నంటా
జోకల నీదేవులసుద్దు లే బొగడుదు

(॥ఇంత॥)
సారెకు నాతో నీ విచ్చకమై నవ్వుదు వంటా
ఆరయ నీయాండ్లపై నాసవెట్టుదు
ఆరీతి నీ విట్టె మాయండ నుండవలె నంటా
యేరా నీ మోహపువారి నింటికి నేఁ దెత్తును

(॥ఇంత॥)
గక్కున నా రతివేళ కరఁగుదువో యంటా
తక్కి నీ లేమల నేర్పు దలఁపింతును
యెక్కు వెఱిఁగి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
మక్కువ ప్రాణసతులమారై నేఁ జొక్కింతును

(||pallavi||)
iṁtagaṁṭĕnemi sedu niṁkā nānadiyyavayya
kāṁta liṁdarū mĕchcham̐ gaḍamā jesĕnu

(||iṁta||)
segŏni nī vadanamu sĕṁgaliṁchavalĕ naṁṭā
nī kāṁtam̐ bŏgaḍudu nī muṁdarane
āga ḍīgaḍa nī menubbai yuṁḍavalĕ naṁṭā
jogala nīdevulasuddu le bŏgaḍudu

(||iṁta||)
sārĕgu nādo nī vichchagamai navvudu vaṁṭā
āraya nīyāṁḍlabai nāsavĕṭṭudu
ārīdi nī viṭṭĕ māyaṁḍa nuṁḍavalĕ naṁṭā
yerā nī mohabuvāri niṁṭigi nem̐ dĕttunu

(||iṁta||)
gakkuna nā radiveḽa karam̐guduvo yaṁṭā
takki nī lemala nerbu dalam̐piṁtunu
yĕkku vĕṟim̐gi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
makkuva prāṇasadulamārai nem̐ jŏkkiṁtunu