ఇంతకంటే వేడుక లేమి చెప్పేది
(॥పల్లవి॥)
ఇంతకంటే వేడుక లేమి చెప్పేది
కాంతల కెప్పుడు నివి గలుగఁగవలయు
(॥ఇంత॥)
పడఁతికి నెంచిచూడ పాయమే సింగారము
జడియనివొరపే చక్కఁదనము
విడువనితనగుట్టె వింతవింత విలాస్తము
చిడుముడిమురిపెమే చెలఁగు విభ్రమము
(॥ఇంత॥)
మునుకొన్న పెనుసిగ్గే మోహనాకారము
తనలోని యణఁకువే తరితీపు
చెనకేవొయ్యారము చెప్పరానిచెలువము
వినయమె యెప్పుడూ వెలలేనిగుణము
(॥ఇంత॥)
చిట్టకపుఁజేఁతే చిమ్మిరేఁచేటిసొబగు
నెట్టుకొన్న వోరుపే నేరుపెల్లాను
ఇట్టి శ్రీవేంకటేశ ఇన్నిటా నలమేలుమంగ
పట్టపుదేవియాయ నీభావమే వొప్పిదము
(||pallavi||)
iṁtagaṁṭe veḍuga lemi sĕppedi
kāṁtala kĕppuḍu nivi galugam̐gavalayu
(||iṁta||)
paḍam̐tigi nĕṁchisūḍa pāyame siṁgāramu
jaḍiyanivŏrabe sakkam̐danamu
viḍuvanidanaguṭṭĕ viṁtaviṁta vilāstamu
siḍumuḍimuribĕme sĕlam̐gu vibhramamu
(||iṁta||)
munugŏnna pĕnusigge mohanāgāramu
tanaloni yaṇam̐kuve taridību
sĕnagevŏyyāramu sĕpparānisĕluvamu
vinayamĕ yĕppuḍū vĕlaleniguṇamu
(||iṁta||)
siṭṭagabum̐jem̐te simmirem̐seḍisŏbagu
nĕṭṭugŏnna vorube nerubĕllānu
iṭṭi śhrīveṁkaḍeśha inniḍā nalamelumaṁga
paṭṭabudeviyāya nībhāvame vŏppidamu