ఇంతకంటె నోపము యేగౌతా నెఱఁగము
(॥పల్లవి॥)
ఇంతకంటె నోపము యేగౌతా నెఱఁగము
పంతము లింకానేల పదవయ్యా
(॥ఇంత॥)
సన్ననేసితివి నీవు సంగడికి వస్తి నేను
యెన్నఁగ మీఁదటిపని యేమనేవయ్యా
కన్నులఁ జూచితివి నీవు కైదండ యిచ్చితి నేను
చిన్నదాన నేమిసేతుఁ జెప్పఁగదవయ్యా
(॥ఇంత॥)
చిరునవ్వు నవ్వితిని సిగ్గువడితిని నేను
యెఱుఁగ మేమిటికౌతా నిది యేమయ్య
జఱపులఁ బెట్టితివి జంకించితిని నేను
మఱఁగులు మొఱఁగులు మఱి యేలయ్యా
(॥ఇంత॥)
కాలుదొక్కితివి నీవు కరఁగితి మేను నేను
వోలి నొక్కమనసుతో వుండవయ్యా
యేలితివి శ్రీవేంకటేశుఁడ విందిర నేను
మేలు మేలు యిన్నిటాను మెచ్చితి నిన్నయ్యా
(||pallavi||)
iṁtagaṁṭĕ nobamu yegaudā nĕṟam̐gamu
paṁtamu liṁkānela padavayyā
(||iṁta||)
sannanesidivi nīvu saṁgaḍigi vasti nenu
yĕnnam̐ga mīm̐daḍibani yemanevayyā
kannulam̐ jūsidivi nīvu kaidaṁḍa yichchidi nenu
sinnadāna nemisedum̐ jĕppam̐gadavayyā
(||iṁta||)
sirunavvu navvidini sigguvaḍidini nenu
yĕṟum̐ga memiḍigaudā nidi yemayya
jaṟabulam̐ bĕṭṭidivi jaṁkiṁchidini nenu
maṟam̐gulu mŏṟam̐gulu maṟi yelayyā
(||iṁta||)
kāludŏkkidivi nīvu karam̐gidi menu nenu
voli nŏkkamanasudo vuṁḍavayyā
yelidivi śhrīveṁkaḍeśhum̐ḍa viṁdira nenu
melu melu yinniḍānu mĕchchidi ninnayyā