Imtagamte nimkanemi iddaraamdla magamdavu

ఇంతకంటే నింకనేమి ఇద్దరాండ్ల మగఁడవు
Language

(॥పల్లవి॥)
ఇంతకంటే నింకనేమి ఇద్దరాండ్ల మగఁడవు
వింతలాయ నీమహిమ విట్ఠలేశ్వరా

(॥ఇంత॥)
సరసము లాడీని సత్యభామ వొకవంక
వొరసీ రుకుమిణి నిన్నొకవంక
సిరుల రొండ్ల నీవు చేతులువెట్టుక యిట్టే
వెరవు విచారించేవు విట్ఠలేశ్వరా

(॥ఇంత॥)
చెలరేఁగి యాపె నిన్ను సెలవుల నవ్వఁగాను
సొలసి సొలసి యీకె చూడఁగాను
నిలువుదండలిద్దరు నెలఁతల మేనులంట
వెలయ నుబ్బేవు మేలు విట్ఠలేశ్వరా

(॥ఇంత॥)
కుడిబుజమానించీ గుబ్బల నీకోమలి
యెడమచెక్కునుఁ జెక్కు యింతి మోపీని
తొడఁదొడ మోపేవు దొరవు నడుమ నీవు
విడువకు శ్రీవేంకట విట్ఠలేశ్వరా

(||pallavi||)
iṁtagaṁṭe niṁkanemi iddarāṁḍla magam̐ḍavu
viṁtalāya nīmahima viṭṭhaleśhvarā

(||iṁta||)
sarasamu lāḍīni satyabhāma vŏgavaṁka
vŏrasī rugumiṇi ninnŏgavaṁka
sirula rŏṁḍla nīvu seduluvĕṭṭuga yiṭṭe
vĕravu visāriṁchevu viṭṭhaleśhvarā

(||iṁta||)
sĕlarem̐gi yābĕ ninnu sĕlavula navvam̐gānu
sŏlasi sŏlasi yīgĕ sūḍam̐gānu
niluvudaṁḍaliddaru nĕlam̐tala menulaṁṭa
vĕlaya nubbevu melu viṭṭhaleśhvarā

(||iṁta||)
kuḍibujamāniṁchī gubbala nīgomali
yĕḍamasĕkkunum̐ jĕkku yiṁti mobīni
tŏḍam̐dŏḍa mobevu dŏravu naḍuma nīvu
viḍuvagu śhrīveṁkaḍa viṭṭhaleśhvarā