ఇంతకంటె నెవ్వరికి నెచ్చరాదు కుందరాదు
(॥పల్లవి॥)
ఇంతకంటె నెవ్వరికి నెచ్చరాదు కుందరాదు
వంతలఁ దగరై తాఁకవచ్చునటవయ్యా
(॥ఇంత॥)
వోఁగునూతులౌభళేశ వొద్దికి నీచెలి డాసె
సాగినసభలలోన చలివాసె
రేఁగినకోపము మాసె రేయే పగలు సేసె
చేఁగల నీకేమి సేసు చెప్పఁగదవయ్యా
(॥ఇంత॥)
నారసింహ కాలుఁదొక్కె నాతి నీకుఁ జేత మొక్కె
గారవపుమోహము అఁగన చొక్కె
సారెకు నీచెక్కునొక్కె జారినకురులు చెక్కె
చేరి యేమిసేసు నిఁక చెప్పఁగదవయ్యా
(॥ఇంత॥)
శ్రీవేంకటేవ ముఁదె శ్రీసతి నీకాఁగి లొందె
భావజురతులలోన ఫల మందె
పూవులలోనిపిందె పొడమినట్టు పొందె
సేవ లింక నేమిసేసుఁ జెప్పఁగదవయ్యా
(||pallavi||)
iṁtagaṁṭĕ nĕvvarigi nĕchcharādu kuṁdarādu
vaṁtalam̐ dagarai tām̐kavachchunaḍavayyā
(||iṁta||)
vom̐gunūdulaubhaḽeśha vŏddigi nīsĕli ḍāsĕ
sāginasabhalalona salivāsĕ
rem̐ginagobamu māsĕ reye pagalu sesĕ
sem̐gala nīgemi sesu sĕppam̐gadavayyā
(||iṁta||)
nārasiṁha kālum̐dŏkkĕ nādi nīgum̐ jeda mŏkkĕ
gāravabumohamu am̐gana sŏkkĕ
sārĕgu nīsĕkkunŏkkĕ jārinagurulu sĕkkĕ
seri yemisesu nim̐ka sĕppam̐gadavayyā
(||iṁta||)
śhrīveṁkaḍeva mum̐dĕ śhrīsadi nīgām̐gi lŏṁdĕ
bhāvajuradulalona phala maṁdĕ
pūvulalonibiṁdĕ pŏḍaminaṭṭu pŏṁdĕ
seva liṁka nemisesum̐ jĕppam̐gadavayyā