ఇంతకంటే నేరుపులు యిఁక నేవయ్యా
(॥పల్లవి॥)
ఇంతకంటే నేరుపులు యిఁక నేవయ్యా
పంతమిచ్చే నిఁక మమ్ము బదికించవయ్యా
(॥ఇంత॥)
మలసి మలసి నీతో మాటలాడి చూచితి
సొలసి కన్నుల మొక్కి చూచితిని
పలుమారు వలపులు పైఁజల్లి చూచితిని
తెలుకొంటే నీవు దేవరవయ్యా
(॥ఇంత॥)
ఇందరి ముందరా నీకు నింపు వుట్టించి చూచితి
చిందుచెమటతో సేవ చేసి చూచితి
పొందుల చనవులెల్లా పొసగించి చూచితి
దిందు పరచుకుందాన దేవరవయ్యా
(॥ఇంత॥)
గక్కన బలిమి నిన్నుఁ గాఁగిలించి చూచితి
చొక్కుచు నిన్నుఁ బొగడి చూచితిని
వొక్కటై శ్రీవేంకటేశ వొడివట్టిలి విప్పుడు
దిక్కుల నిన్ను మెచ్చితి దేవరవయ్యా
(||pallavi||)
iṁtagaṁṭe nerubulu yim̐ka nevayyā
paṁtamichche nim̐ka mammu badigiṁchavayyā
(||iṁta||)
malasi malasi nīdo māḍalāḍi sūsidi
sŏlasi kannula mŏkki sūsidini
palumāru valabulu paim̐jalli sūsidini
tĕlugŏṁṭe nīvu devaravayyā
(||iṁta||)
iṁdari muṁdarā nīgu niṁpu vuṭṭiṁchi sūsidi
siṁdusĕmaḍado seva sesi sūsidi
pŏṁdula sanavulĕllā pŏsagiṁchi sūsidi
diṁdu parasuguṁdāna devaravayyā
(||iṁta||)
gakkana balimi ninnum̐ gām̐giliṁchi sūsidi
sŏkkusu ninnum̐ bŏgaḍi sūsidini
vŏkkaḍai śhrīveṁkaḍeśha vŏḍivaṭṭili vippuḍu
dikkula ninnu mĕchchidi devaravayyā