Imtagamte nemisese velaraa neegu navvu

ఇంతకంటె నేమిసేసే వేలరా నీకు నవ్వు
Language

(॥పల్లవి॥)
ఇంతకంటె నేమిసేసే వేలరా నీకు నవ్వు
పంతగాఁడవైతివి అప్పటి నా నవ్వు

(॥ఇంత॥)
వుమ్మడి నీతో నలిగి వొంటినుండి నామలగు
నెమ్మదిఁ గాఁగిలించితే నీకేలరా నవ్వు
దిమ్మువట్టి కొనగోరు తీఁటగోఁగా నిమ్మపండు
ఇమ్ముల నాఁటనూఁదితే ఇంతేల నవ్వు

(॥ఇంత॥)
వొట్టు వెట్టుకొంటిఁగాన వొకరితోఁ బలుకక
నెట్టన నేఁ బాడుకొంటే నీకేల నవ్వు
నిట్టనీల్గి నీ వుండఁగా నిద్ర రాఁగా గడెవెట్టి
పట్టేమంచానఁ బండితే పైఁజల్లకు నవ్వు

(॥ఇంత॥)
కామించి నివు గూడఁగా కన్నుమూసి కొంతవడి
నీమనసు చూచితేను నీకేలరా నవ్వు
దోమటి శ్రీవేంకటేశ తోడిఁబడ దక్కఁగొంటి-
నీమతకా లెఱఁగరా యిఁకనేల నవ్వు

(||pallavi||)
iṁtagaṁṭĕ nemisese velarā nīgu navvu
paṁtagām̐ḍavaidivi appaḍi nā navvu

(||iṁta||)
vummaḍi nīdo naligi vŏṁṭinuṁḍi nāmalagu
nĕmmadim̐ gām̐giliṁchide nīgelarā navvu
dimmuvaṭṭi kŏnagoru tīm̐ṭagom̐gā nimmabaṁḍu
immula nām̐ṭanūm̐dide iṁtela navvu

(||iṁta||)
vŏṭṭu vĕṭṭugŏṁṭim̐gāna vŏgaridom̐ balugaga
nĕṭṭana nem̐ bāḍugŏṁṭe nīgela navvu
niṭṭanīlgi nī vuṁḍam̐gā nidra rām̐gā gaḍĕvĕṭṭi
paṭṭemaṁchānam̐ baṁḍide paim̐jallagu navvu

(||iṁta||)
kāmiṁchi nivu gūḍam̐gā kannumūsi kŏṁtavaḍi
nīmanasu sūsidenu nīgelarā navvu
domaḍi śhrīveṁkaḍeśha toḍim̐baḍa dakkam̐gŏṁṭi-
nīmadagā lĕṟam̐garā yim̐kanela navvu