Imtagamte nemisedu vimka neevu

ఇంతకంటె నేమిసేతు విఁక నీవు
Language

(॥పల్లవి॥)
ఇంతకంటె నేమిసేతు విఁక నీవు
పంతము చేకొంటివి పడఁతిచే నీవు

(॥ఇంత॥)
వచ్చి వచ్చి నిన్నుఁ జూచి వలపులఁ గొసరఁగ-
నిచ్చితివి చనవు నీ వింతికిని
పచ్చిదేర నప్పటిని పానుపుపైఁ గూచుండి
మచ్చికసుద్దులు విని మరుగఁజేసితివి

(॥ఇంత॥)
సారెసారె జూజమాడి సరిఁ బొద్దుఁ గడపక
చేరి మన్నించితి విట్టె చెలియను
గారవించి యిప్పుడును కాయము గాయము సోఁక
పేరడి నీతో సరి పెనగజేసితివి

(॥ఇంత॥)
కూడి మాడి నీకాఁగిట గురుతులు ధరించఁగ
వోడక దొరఁ జేసితి వువిదను
యీడనె శ్రీవేంకటేశ యిట్టె నవ్వు నవ్వుచు
వేడుకైనరతులను వెలయఁజేసితివి

(||pallavi||)
iṁtagaṁṭĕ nemisedu vim̐ka nīvu
paṁtamu segŏṁṭivi paḍam̐tise nīvu

(||iṁta||)
vachchi vachchi ninnum̐ jūsi valabulam̐ gŏsaram̐ga-
nichchidivi sanavu nī viṁtigini
pachchidera nappaḍini pānububaim̐ gūsuṁḍi
machchigasuddulu vini marugam̐jesidivi

(||iṁta||)
sārĕsārĕ jūjamāḍi sarim̐ bŏddum̐ gaḍabaga
seri manniṁchidi viṭṭĕ sĕliyanu
gāraviṁchi yippuḍunu kāyamu gāyamu som̐ka
peraḍi nīdo sari pĕnagajesidivi

(||iṁta||)
kūḍi māḍi nīgām̐giḍa gurudulu dhariṁcham̐ga
voḍaga dŏram̐ jesidi vuvidanu
yīḍanĕ śhrīveṁkaḍeśha yiṭṭĕ navvu navvusu
veḍugainaradulanu vĕlayam̐jesidivi