ఇంతకంటె నే మయ్యీ నింకా నాకు
(॥పల్లవి॥)
ఇంతకంటె నే మయ్యీ నింకా నాకు
వింత సతుల పొందులు విడువవు పోరా
(॥ఇంత॥)
మాటలే పోట్లయితే మందులు చేటెఁడు గావా
యేటికి పగలు చాటే వేరా నీవు
చీటికి మాటికి నీవు సేసినట్టు సేతు గాని
వాటు లేక పందె మాడ వద్దు వద్దు పోరా
(॥ఇంత॥)
చీలకు చీల వెట్టితే చిక్కి యడవి చాలదు
యేలమాతోఁ బోరేవు యేరా నీవు
నాలిసేసి మమ్ము నిట్టే నవ్వితే నవ్వుదు గాని
జాళె లేక బొమ్మరము సారె వేయ నేలరా
(॥ఇంత॥)
కతకుఁ గాళ్గు గలితే కలవు ముంతకుఁ జెవులు
వెతలఁ బెట్టక కొంగు వీడరా నీవు
యితవుగ శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
బతిమి సుఖము దక్కెఁ బంత మిచ్చెఁ బోరా
(||pallavi||)
iṁtagaṁṭĕ ne mayyī niṁkā nāgu
viṁta sadula pŏṁdulu viḍuvavu porā
(||iṁta||)
māḍale poṭlayide maṁdulu seḍĕm̐ḍu gāvā
yeḍigi pagalu sāḍe verā nīvu
sīḍigi māḍigi nīvu sesinaṭṭu sedu gāni
vāḍu lega paṁdĕ māḍa vaddu vaddu porā
(||iṁta||)
sīlagu sīla vĕṭṭide sikki yaḍavi sāladu
yelamādom̐ borevu yerā nīvu
nālisesi mammu niṭṭe navvide navvudu gāni
jāḽĕ lega bŏmmaramu sārĕ veya nelarā
(||iṁta||)
kadagum̐ gāḽgu galide kalavu muṁtagum̐ jĕvulu
vĕdalam̐ bĕṭṭaga kŏṁgu vīḍarā nīvu
yidavuga śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
badimi sukhamu dakkĕm̐ baṁta michchĕm̐ borā