Imtagamte ne mari yemi sedunu

ఇంతకంటే నే మరి యేమి సేతును
Language

(॥పల్లవి॥)
ఇంతకంటే నే మరి యేమి సేతును
వింతవై వుండఁగాను వేఁడుకొంటి నేను

(॥ఇంత॥)
కామించి పెంజెమటలు గారఁగా నీవు వచ్చి
నామొగము చూడఁగాను నవ్వితి నేను
చేముంచి బేంట్లు రాలేచిట్లుగందాలతోడ
ప్రేమమున నన్నంటఁగాఁ బెనఁగితి నేను

(॥ఇంత॥)
అందుఁ జేయరాని చేఁత లన్నియునుఁ జేసి వచ్చి
ముందే మాటాడఁగాను మొక్కితి నేను
సందడించి దప్పిగొని సారె నామోవి యానఁగా
గొంది సిగ్గునఁ దప్పించుకొని వుంటి నేను

(॥ఇంత॥)
తగ నీ పుక్కిళ్ల రెంటఁ దమ్ములము నిండుండఁగా
మిగులా నాకియ్యరాఁగా మెచ్చితి నేను
పగటున శ్రీవేంకటపతివి నన్నేలితివి
మగఁడవు నీఁకాఁగిలి మరిగితి నేను

(||pallavi||)
iṁtagaṁṭe ne mari yemi sedunu
viṁtavai vuṁḍam̐gānu vem̐ḍugŏṁṭi nenu

(||iṁta||)
kāmiṁchi pĕṁjĕmaḍalu gāram̐gā nīvu vachchi
nāmŏgamu sūḍam̐gānu navvidi nenu
semuṁchi beṁṭlu rālesiṭlugaṁdāladoḍa
premamuna nannaṁṭam̐gām̐ bĕnam̐gidi nenu

(||iṁta||)
aṁdum̐ jeyarāni sem̐ta lanniyunum̐ jesi vachchi
muṁde māḍāḍam̐gānu mŏkkidi nenu
saṁdaḍiṁchi dappigŏni sārĕ nāmovi yānam̐gā
gŏṁdi siggunam̐ dappiṁchugŏni vuṁṭi nenu

(||iṁta||)
taga nī pukkiḽla rĕṁṭam̐ dammulamu niṁḍuṁḍam̐gā
migulā nāgiyyarām̐gā mĕchchidi nenu
pagaḍuna śhrīveṁkaḍabadivi nannelidivi
magam̐ḍavu nīm̐kām̐gili marigidi nenu