Imtagamte naadamdu ma remi sesune

ఇంతకంటె నాతఁడు మ రేమి సేసునే
Language

(॥పల్లవి॥)
ఇంతకంటె నాతఁడు మ రేమి సేసునే
యింతులాల రమణుని నేల దూరేరే

(॥ఇంత॥)
కన్నుల మెక్కనె పట్టె కాఁకఁల బెనఁగఁ బట్టె
వెన్నెలనవ్వులు నవ్వ వేళ లేదే
పన్ని నెత్త మాడఁ బట్టె పరాకు నేయనె పట్టె
యిన్నిటా జాణఁడు వాని నేల దూరేరే

(॥ఇంత॥)
సరస మాడఁ బట్టె సంగడిఁ గూచుండఁ బట్టె
విరులు ముడువ నైన వేళ లేదే
కురులు దువ్వనె పట్టెఁ గొలువు సేయనె పట్టె
యిర వెరుఁగు నాతఁడె యేల దూరేరే

(॥ఇంత॥)
చొక్కుచు నుండనె పట్టె సుద్దులు చెప్పనె పట్టె
వెక్క సపురతులకు వేళ లేదే
పక్కన శ్రీవెంకటాద్రిపతి నన్ను నిటు గూడె
నిక్కడ నే విన నోప నేల దూరేరే

(||pallavi||)
iṁtagaṁṭĕ nādam̐ḍu ma remi sesune
yiṁtulāla ramaṇuni nela dūrere

(||iṁta||)
kannula mĕkkanĕ paṭṭĕ kām̐kam̐la bĕnam̐gam̐ baṭṭĕ
vĕnnĕlanavvulu navva veḽa lede
panni nĕtta māḍam̐ baṭṭĕ parāgu neyanĕ paṭṭĕ
yinniḍā jāṇam̐ḍu vāni nela dūrere

(||iṁta||)
sarasa māḍam̐ baṭṭĕ saṁgaḍim̐ gūsuṁḍam̐ baṭṭĕ
virulu muḍuva naina veḽa lede
kurulu duvvanĕ paṭṭĕm̐ gŏluvu seyanĕ paṭṭĕ
yira vĕrum̐gu nādam̐ḍĕ yela dūrere

(||iṁta||)
sŏkkusu nuṁḍanĕ paṭṭĕ suddulu sĕppanĕ paṭṭĕ
vĕkka saburadulagu veḽa lede
pakkana śhrīvĕṁkaḍādribadi nannu niḍu gūḍĕ
nikkaḍa ne vina noba nela dūrere