ఇంతకంటే మరిలేదు యెవ్వరికి నుపాయము
(॥పల్లవి॥)
ఇంతకంటే మరిలేదు యెవ్వరికి నుపాయము
యెంతైనా నిదియు నీ విచ్చితేనే కలుగు
(॥ఇంత॥)
హరి నీచిత్తము వట్టేయందుకు నుపాయము
ధర నిన్ను బోధించే నీదాసులమాఁటే
దురతములన్నిటిని తొలగించే వుపాయము
నిరంతరమును నీనామజపమే
(॥ఇంత॥)
దండితోడ నీమాయ దాఁటేయందు కుపాయము
నిండు నిధానమైన నీపైభక్తే
అండనున్న కామాదుల నణచుట కుపాయము
కొడవంటి నీమూర్తిఁ గోరి శరణనుటే
(॥ఇంత॥)
పుట్టుగులు గెలిచి నిన్ను బొందుట కుపాయము
అట్టె నీరూపమైన ఆచార్యుడే
యిట్టె శ్రీవేంకటేశ యిన్నిటికి నుపాయము
మట్టులేని రామానుజమతము చేకొనుటే
(||pallavi||)
iṁtagaṁṭe mariledu yĕvvarigi nubāyamu
yĕṁtainā nidiyu nī vichchidene kalugu
(||iṁta||)
hari nīsittamu vaṭṭeyaṁdugu nubāyamu
dhara ninnu bodhiṁche nīdāsulamām̐ṭe
duradamulanniḍini tŏlagiṁche vubāyamu
niraṁtaramunu nīnāmajabame
(||iṁta||)
daṁḍidoḍa nīmāya dām̐ṭeyaṁdu kubāyamu
niṁḍu nidhānamaina nībaibhakte
aṁḍanunna kāmādula naṇasuḍa kubāyamu
kŏḍavaṁṭi nīmūrdim̐ gori śharaṇanuḍe
(||iṁta||)
puṭṭugulu gĕlisi ninnu bŏṁduḍa kubāyamu
aṭṭĕ nīrūbamaina āsāryuḍe
yiṭṭĕ śhrīveṁkaḍeśha yinniḍigi nubāyamu
maṭṭuleni rāmānujamadamu segŏnuḍe