ఇంతకంటే లాభము యెట్టు గడించుకొనేవు
(॥పల్లవి॥)
ఇంతకంటే లాభము యెట్టు గడించుకొనేవు
యెంతలేదు విచారము యేమి సేసే వీడను
(॥ఇంత॥)
చెలరేఁగి నవ్వుకొంటా చెలులతో నీసుద్దులే
పలుమారు నాడుకొనీ పడఁతి
తలుపుమాటుననుండి తగ విందువు రావయ్య
యెలమి మాపుదాఁకా నేమిసేసే వీడను
(॥ఇంత॥)
నీ కెదురే చూచుకొంటా నీపదాలె పాడుకొంటా
జోకలుగా వేగించీ సుసుదతి
వాకిటవుండే తప్పక వడిఁ జూతువు రావయ్య
యీకడ నెంత పొద్దైనా నేమి సేసే వీడను
(॥ఇంత॥)
నీ రూపే వ్రాసుకొంటా నీ పేరఁ బిలుచుకొంటా
ఆరసి వలపు చల్లీ నతివ
యీరీతి శ్రీ వేంకటేశ యిటు విచ్చేసి కూడితి
వీరచ్చలు సేయవచ్చే వేమిసేసే వీడను
(||pallavi||)
iṁtagaṁṭe lābhamu yĕṭṭu gaḍiṁchugŏnevu
yĕṁtaledu visāramu yemi sese vīḍanu
(||iṁta||)
sĕlarem̐gi navvugŏṁṭā sĕlulado nīsuddule
palumāru nāḍugŏnī paḍam̐ti
talubumāḍunanuṁḍi taga viṁduvu rāvayya
yĕlami mābudām̐kā nemisese vīḍanu
(||iṁta||)
nī kĕdure sūsugŏṁṭā nībadālĕ pāḍugŏṁṭā
jogalugā vegiṁchī susudadi
vāgiḍavuṁḍe tappaga vaḍim̐ jūduvu rāvayya
yīgaḍa nĕṁta pŏddainā nemi sese vīḍanu
(||iṁta||)
nī rūbe vrāsugŏṁṭā nī peram̐ bilusugŏṁṭā
ārasi valabu sallī nadiva
yīrīdi śhrī veṁkaḍeśha yiḍu vichchesi kūḍidi
vīrachchalu seyavachche vemisese vīḍanu